హీరో చెంప పగులగొట్టిన రాధికా ఆప్టే


radhika apte slapped south hero నా పట్ల అనుచితంగా ప్రవర్తించిన దక్షిణాది హీరో చెంప పగుల గొట్టానని సంచలన వ్యాఖ్యలు చేసింది వివాదాస్పద హీరోయిన్ రాధికా ఆప్టే . దక్షిణాది లో ధోని , లెజెండ్ , లయన్ , కబాలి , రక్త చరిత్ర లాంటి చిత్రాల్లో నటించింది రాధికా ఆప్టే . దక్షిణాది లో ఓ చిత్రంలో నటిస్తున్నప్పుడు షూటింగ్ మొదటి రోజునే ఓ హీరో రాధికా ఆప్టే తొడలను అసభ్యంగా తాకాడట ! దాంతో చిర్రెత్తుకొచ్చిన రాధికా ఆప్టే వెంటనే ఆ హీరో చెంప పగులగొట్టిందట .

 

అసలు ఆ హీరో తో కనీస పరిచయం కూడా లేదని , అలాంటి వాడు అసభ్యంగా ఎలా తాకుతాడని అందుకే చెంప చెడెల్ మనిపించానని నేహా ధూపియా షోలో పాల్గొని ఈ విషయాలను చెప్పింది రాధికా ఆప్టే . గతంలో కూడా దక్షిణాది చిత్రాల్లో ఇక నటించనని అక్కడ హీరోయిన్ అంటే పక్కలో పడుకునే భామ అని అనుకుంటారని పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే .