హీరో భార్యకు కోపం వచ్చింది


Radhika pandit Fires on netizens

కన్నడ స్టార్ హీరో యష్ భార్య రాధికా పండిట్ కు కోపం వచ్చింది దాంతో నెటిజన్ల పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది రాధికా పండిట్ . ఇంతకీ రాధికా పండిట్ కు కోపం ఎందుకు వచ్చిందో తెలుసా ……. కొంతమంది నెటిజన్లు రాధికా పండిట్ ని సినిమాలు మానేయాలని , హాయిగా పాప యోగక్షేమాలు చూసుకుంటూ సంసారం కొనసాగించాలని ఉచిత సలహా ఇచ్చారు దాంతో రాధికా పండిట్ కు విపరీతమైన కోపం వచ్చింది .

 

నన్ను నటన మానేయమని సలహా ఇచ్చే సాహసం చేయొద్దని , నాకు అనిపించినప్పుడే నటన మానేస్తానని అప్పటివరకు నటించడం ఆపనని ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది . స్టార్ హీరో యష్ భార్య అయిన రాధికా పండిట్ కూడా హీరోయిన్ అన్న విషయం తెలిసిందే . యష్ తో పెళ్లి కుదరగానే ఒప్పుకున్న సినిమాలన్నీ కంప్లీట్ చేసింది , ప్రస్తుతం ఒక పాప ఈ ఇద్దరికీ . దాంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది . అయితే ఇంటిపట్టున ఉంటున్న రాధికా పండిట్ ని మళ్ళీ సినిమాల్లోకి రావద్దని కోరుతున్నారు నెటిజన్లు .

English Title: Radhika pandit Fires on netizens