క్యాన్సర్ పుకార్లపై స్పందించిన రాధిక


actress radhika responds on blood cancer rumoursసీనియర్ నటి రాధికకు బ్లడ్ క్యాన్సర్ అని తమిళనాట కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడంతో ఎట్టకేలకు స్పందించింది రాధిక . నాకు క్యాన్సర్ లేదు …… క్షేమంగా ఉన్నాను అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అంటూ ట్వీట్ చేసింది . దయచేసి ఆ పుకార్ల ని నమ్మొద్దు అంటూ కోరుతోంది కూడా . తెలుగు , తమిళ చిత్రాల్లోనే కాకుండా దక్షిణ భారతంలోని అన్ని భాషలలో హీరోయిన్ గా నటించిన భామ రాధిక . చిరంజీవి తో అత్యధికంగా ఎక్కువ సినిమాలు చేసిన రాధిక తమిళ హీరో శరత్ కుమార్ ని పెళ్లి చేసుకుంది .

ఇటీవలే తన కూతురు కి పెళ్లి కూడా చేసింది రాధిక , అయితే కాస్త అనారోగ్యానికి గురి కావడంతో ఆమెకు క్యాన్సర్ అంటూ పుకార్లు పుట్టించారు అక్కడి తమిళ మీడియా . ఈ విషయం రాధిక చెవిన పడటంతో స్పందించి పుకార్ల ని ఖండించింది . ఎప్పుడూ చలాకీగా ఉండే రాధిక ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సీరియల్ లలో కూడా నటిస్తోంది అలాగే రాడాన్ సంస్థ పై పలు విజయవంతమైన సీరియల్ లను తెలుగు , తమిళ ప్రజలకు అందించింది రాధిక .