భారీ పేలుళ్ల నుండి తృటిలో తప్పించుకున్న రాధికా


భారీ పేలుళ్ల నుండి తృటిలో తప్పించుకుంది సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ . శ్రీలంక లో ఈరోజు భారీ ఎత్తున పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే . టెర్రరిస్ట్ లు పేల్చిన బాంబ్ పేలుళ్లలో 50 మంది మృత్యువాత పడగా వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు . అయితే శ్రీలంగా రాజధాని కొలొంబోలో పేలుళ్లు జరిగే ముందే ఓ స్టార్ హోటల్ నుండి రాధికా ఖాళీ చేసి వెళ్ళిపోయింది దాంతో దేవుడు నాతో ఉన్నాడు అందుకే ప్రాణాలతో బయట పడ్డాను అంటూ ట్వీట్ చేసింది .

రాధికా శరత్ కుమార్ కొలొంబో లోని సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో బస చేసింది . అయితే ఈరోజు పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో సిన్నామన్ గ్రాండ్ హోటల్ కూడా ఉంది . దాంతో పెద్ద ప్రమాదం నుండి బయటపడినట్లయింది . ఈరోజు ఈస్టర్ పండగ సందర్బంగా చర్చ్ లలో అలాగే సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో బాంబు దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు . ఈ సంఘటనతో ఒక్కసారిగా శ్రీలంక అంతటా హై అలర్ట్ ప్రకటించారు .