శ్రీరెడ్డి కి షాక్ ఇచ్చిన లారెన్స్


raghava lawrence challenge to sri reddy

వివాదాస్పద నటి శ్రీరెడ్డి కి షాక్ ఇచ్చాడు దర్శకుడు , నటుడు రాఘవ లారెన్స్ . శ్రీరెడ్డి లారెన్స్ పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . అయితే ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న లారెన్స్ తాజాగా ఆమెకు గట్టిగా బుద్ది చెప్పాలని భావించి శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించాడు . నేను నీతో డ్యాన్స్ చేసానా ? ఆ విషయాన్ని పక్కన పెడదాం అందరి ముందు డ్యాన్స్ లో కొన్ని సులువైన మూమెంట్స్ చెబుతాను చెయ్ అలాగే నటనలో కూడా చిన్నపాటి సీన్స్ ఇస్తాను అవి చేస్తే నా తదుపరి సినిమాలో తప్పకుండా ఛాన్స్ ఇస్తాను అప్పుడు నీ ప్రతిభ ఏంటో నిరూపించుకో అంటూ సవాల్ విసిరి షాక్ ఇచ్చాడు లారెన్స్ .

ప్రభాస్ హీరోగా రెబల్ అనే సినిమా చేసాడు రాఘవ లారెన్స్ కాగా ఆ సినిమా సమయంలోనే హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో డ్యాన్స్ పేరుతో నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి . ఒక్క లారెన్స్ నే కాకుండా తమిళంలోని పలువురు ప్రముఖులను టార్గెట్ చేసింది , అయితే వాళ్ళు అందరూ కాస్త ఆలస్యంగానైనా రియాక్ట్ అవుతున్నారు శ్రీ రెడ్డి పై . కాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన ఈ భామ ఇప్పుడు తమిళ చిత్రపరిశ్రమ పై కన్నేసింది .

English Title: raghava lawrence challenge to sri reddy