156 చిన్నారులకు ప్రాణదానం చేసిన రియల్ హీరో


Raghava Lawrence Did 156 heart operations succesfully
Raghava Lawrence Did 156 heart operations succesfully

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 156 మంది చిన్నారులకు ప్రాణదానం చేసి రియల్ హీరో అనిపించుకుంటున్నాడు రాఘవ లారెన్స్ . సాధారణ స్థాయి నుండి అసాధారణ స్థాయికి చేరుకున్నాడు లారెన్స్ . భారీ మొత్తంలో డబ్బులు వస్తుంటే వాటిని జల్సాల కోసం వాడకుండా పేద కుటుంబాల్లో వెలుగులు నింపడానికి , అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను బ్రతికించడానికి ఉపయోగిస్తూ సద్వినియోగం చేస్తున్నాడు లారెన్స్ .

ఇటీవలే 156 వ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు లారెన్స్ . ఆ ఆపరేషన్ సక్సెస్ కావడంతో 156 మందికి ఆపరేషన్ చేయించానని సంతృప్తిగా ఉందని ట్వీట్ చేసాడు రాఘవ లారెన్స్ . ఆపదలో ఉన్న వాళ్లకు తన చేతనైనంత సహాయం చేస్తూ రీల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకుంటున్నాడు లారెన్స్ . హర్రర్ చిత్రాలతో భయపెడుతూ , నవ్విస్తూ ప్రేక్షకులను సంతోషంలో ముంచెత్తుతున్న లారెన్స్ ఇలా ప్రజాసేవలో కూడా తరించిపోతున్నాడు .