130 కోట్లు సాధించిన కాంచన 3


హర్రర్ చిత్రాల నేపథ్యంలో వరుస సిరీస్ లతో రాఘవ లారెన్స్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . తాజాగా కాంచన 3 చిత్రంతో 130 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించాడు లారెన్స్ . ముని చిత్రం తొలుత తీయగా అది సూపర్ హిట్ అయ్యింది తెలుగు , తమిళ భాషల్లో దాంతో అప్పటి నుండి ఈ దెయ్యాల సినిమాలకు క్రేజ్ కూడా వచ్చేసింది . ఆ తర్వాత కాంచన , గంగ , కాంచన 3 అంటూ వరుసగా దెయ్యాల చిత్రాలతో దాడి చేసాడు హిట్స్ కొట్టాడు లారెన్స్ .

ఏప్రిల్ 19 న తెలుగు , తమిళ భాషల్లో విడుదలైన కాంచన 3 ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల భారీ వసూళ్ల ని సాధించింది . ఒక్క తమిళనాటనే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించింది కాంచన 3 . ఈ చిత్రానికి రివ్యూస్ అంతగా బాగా రాలేదు కానీ రివ్యూలని పక్కన పెట్టి బిసి కేంద్రాల్లో వసూళ్ల సునామి సృష్టించింది . ఇప్పటివరకు తమిళనాట తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది కాంచన 3 . ఇక తెలుగులో కూడా ఠాగూర్ మధు కి తిరుగులేని విజయాన్నిచ్చింది కాంచన 3 .