హాస్య నటుడి కి కారు ప్రమాదం


raghu karumanchi great ascape from accidentడిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హాస్య నటుడు రఘు కారుమంచి కారు ప్రమాదానికి గురయ్యాడు అయితే భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకొని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు . ఈ సంఘటన వర్జీనియా లో జరిగింది . రఘు కారుమంచి కారులో వెళుతున్న సమయంలో యాక్సిడెంట్ జరగడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు అయితే పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు . ప్రస్తుతం బాగానే ఉన్నాడు రఘు .

తెలుగులో పలు చిత్రాల్లో కామెడీ విలన్ గా నటించాడు రఘు , తనదైన బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు దాంతో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది . సినిమాలతో పాటుగా కామెడీ ప్రోగ్రామ్ జబర్దస్త్ లో కూడా చేసాడు రఘు . హాస్య నటుడు రఘు కి కారు ప్రమాదం అని వార్తలు రాగానే అందరూ కంగారు పడ్డారు అయితే రఘు క్షేమంగా ఉన్నాడని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు . ఇక రఘు కూడా నేను బాగానే ఉన్నానని తెలిపాడు .