ర‌ఘు కుంచె హీరోగా పిరియాడిక్ ఫిల్మ్‌!


ర‌ఘు కుంచె హీరోగా పిరియాడిక్ ఫిల్మ్‌!
ర‌ఘు కుంచె హీరోగా పిరియాడిక్ ఫిల్మ్‌!

న‌టుడిగా, సంగీత ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ర‌ఘు కుంచె మ‌ళ్లీ న‌టుడిగా బిజీ అవుతున్నారు. త‌న‌కు త‌గ్గ పాత్ర‌ల్లో న‌టిస్తూ కొత్త బాట‌లు వేసుకుంటున్నారు. `ప‌లాస 1978` చిత్రంలో అత్యుత్త‌మ‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ర‌ఘు కుంచె ఈ సారి హీరోగా క‌నిపించ‌బోతున్నారు. అదీ పిరియాడిక్ ఫిల్మ్ .

1991లో జ‌రిగిన ఓ అన్ టోల్డ్ స్టోరీని `క‌థా న‌ళిని` పేరుతో తెర‌కెక్కిస్తున్నారు. 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభ‌విస్తున్న ఓ మ‌హిళ క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. గోగో మూవీస్ బ్యాన‌ర్‌పై తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా రూపొంద‌నుంది. స్టార్ హీరోయిన్ టైటిల్ పాత్ర‌లో న‌టించ‌నుండ‌గా ఆమె భ‌ర్త‌గా ర‌ఘు కుంచే మురుగ‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

మ‌హేంద్ర కొక్కిరిగ‌డ్డ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఒక మ‌హా విస్పోట‌నం వెన‌క వున్న ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా ఓ పిరియాడిక్ ఫిల్మ్‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని విశేషాల్ని ర‌ఘు కుంచె త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. ఈ చిత్రానికి సంగీతం ర‌ఘు కుంచె.