ఆర్టికల్ 370 రద్దుని తప్పుపట్టిన రాహుల్ గాంధీ


Rahulu Gandhi

జమ్మూ కశ్మీర్ పై తొలిసారి పెదవి విప్పారు కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ . ఆర్టికల్ రద్దు నిర్ణయం తొందరపాటు చర్య అని , ఈ నిర్ణయం వల్ల మనసులు గెలుచుకోలేమని ట్వీట్ చేసాడు రాహుల్ . మోడీ – షా జోడీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మరింత గందరగోళ పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు రాహుల్ .

జమ్మూ కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . అయితే రాహుల్ మాత్రం తాజాగా స్పందించాడు . ఇక రాహుల్ స్పందన కూడా ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తప్పే అని అంటున్నాడు . అయితే ప్రతిపక్షాలు ఎంతగా నోరు నెత్తిలో పెట్టుకున్నా మోడీ – షా మాత్రం ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయడం లేదు . కాశ్మీర్ కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా కానీ వెనకడుగు వేసేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా .