ప్రకాష్ రాజ్ పార్టీలో రాహుల్ – పునర్నవి రచ్చ


Rahul- punarnavi crazy moments at prakash raj party
Rahul- punarnavi crazy moments at prakash raj party

ప్రస్తుతం వినోద రంగంలో ఒక నీచమైన ట్రెండ్ నడుస్తోంది. అది ఏంటీ అంటే, తాము ఫీల్డ్ లో ఎదగడానికో, కొత్తగా హైప్ రావడం కోసమో, లేక ఉన్నది కాపాడుకోడానికో తెలియదు గానీ.. జనాలను వెధవలను చెయ్యడం మాత్రం బాగా నేర్చుకుంటున్నారు ఇప్పుడిప్పుడే పుడుతున్న / పుట్టిన లేత స్టార్లు. ఉన్న టాలెంట్ ని కన్నా, లేని అఫైర్స్ ని బాగా ప్రమోట్ చేసుకుంటూ పని కానిస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర స్టార్లు అయితే మరీ..

ఇప్పుడు వాళ్ళలో ప్రస్తుతం సమాజ సేవలో తరిస్తున్న బిగ్ బాస్ కంటెస్టంట్ లు రాహుల్ – పునర్నవి ఒకరు. ఇప్పుడు రాహుల్ సిప్లీగంజ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్షన్ లో రంగ- మార్తాండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ ముఖ్య పాత్రధారులు. తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ ఈ టీం కి ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో రాహుల్ యధావిధిగా పాటలతో అలరించాడు. ముఖ్యంగా ఈ పార్టీలో పునర్నవి తో కలిసి జంటగా రాహుల్ పార్టిసిపేట్ చెయ్యడం, గతంలో ఈవెంట్స్ మాదిరి, ఈ పార్టీలో కూడా రాహుల్ – పునర్నవి జంట  అతి కూడా ఆశించినట్టే ఉంది.

ఆ వీడియోను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఏదీ ఏమైనా చివరకి మనోడు బ్రేకప్ ఆల్బమ్స్ చేసుకునే పరిస్థితి రాకుండా ఉంటే అదే హ్యాపీ.

 

View this post on Instagram

 

Memorable Evening!? @awm_band Thank you so much for being so wonderful. We really enjoyed?

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on