ఆ టైటిల్ ఎవరి కోసం


Rahul Ravindran for Manmadhudu 2

మన్మథుడు 2 టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు కింగ్ నాగార్జున , అయితే ఆ టైటిల్ ఎవరి కోసం అన్నది ప్రశ్నగా మారింది . 2002 లో నాగార్జున నటించిన మన్మధుడు విడుదలై సంచలన విజయం సాధించింది . కట్ చేస్తే 16 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ లా ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున అందుకే కాబోలు మన్మధుడు 2 టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు . అయితే మన్మధుడు 2లో హీరోగా నటించేది నాగార్జున నా ? లేక నాగచైతన్య నా ? అఖిల్ నా అన్నది తేలాలి , ఈ ముగ్గురిలో మన్మధుడు 2 గా కనిపించేది ఎవరన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది .

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నాడు . చిలసౌ చిత్రంతో నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు . మొదటి చిత్రంతోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు రాహుల్ రవీంద్రన్ . దాంతో ఆ సినిమా చూసిన నాగార్జున రాహుల్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . చిలసౌ కి టాక్ బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం అంత గొప్పగా ఏమి లేవు . అయినప్పటికీ రాహుల్ కు మంచి పేరు వచ్చింది కాబట్టి తప్పకుండా నాగార్జున అతడితో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు .

English Title: rahul ravindran for manmadhudu 2