ఈరోజే రాహుల్ బిగ్ బాస్ రీ-ఎంట్రీ


Rahul-sipligunj
Rahul-sipligunj

బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు ట్విస్ట్ లు ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. లాస్ట్ వీకెండ్ డబల్ ఎలిమినేషన్ అని చెప్పి శనివారం రాహుల్ ను పంపేసినా అది ఫేక్ ఎలిమినేషన్ అని లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇక ఆదివారమంతా సీక్రెట్ రూమ్ లో హౌజ్ లో ఏం జరుగుతోందో చుసిన రాహుల్ ఈరోజు బిగ్ బాస్ హౌజ్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు.

రాహుల్ రీ-ఎంట్రీ పట్ల అందరికన్నా పునర్నవి ఎక్కువ ఆనందంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

రీ-ఎంట్రీతో వచ్చిన వాళ్ళు గత రెండు సీజన్లలో పెద్దగా సాధించింది ఏం లేదు. మరి రాహుల్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడా లేక మధ్యలోనే వెళ్ళిపోతాడా అన్నది చూడాలి.