ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే బిగ్ బాస్ 3 విన్నర్ అతనే!


ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే బిగ్ బాస్ 3 విన్నర్ అతనే!
ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే బిగ్ బాస్ 3 విన్నర్ అతనే!

ఎవరూ ఊహించని వాళ్ళు విన్నర్ అవ్వడం బిగ్ బాస్ చరిత్రలో కొత్తేమి కాదు. బిగ్ బాస్ 2 లో కౌశల్ విన్నర్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. తనీష్, సామ్రాట్, తేజస్వి లాంటి బలమైన కంటెస్టెంట్స్ ఉండడంతో వీరిలో ఒకరు విన్నర్ అవుతారని అనుకున్నారు. కానీ తనకు జరిగిన చిన్న అన్యాయం నుండి క్యాష్ చేసుకుని కౌశల్ బలమైన పవర్ గా నిలిచాడు. బయట ఓటర్లను ప్రలోభపెట్టడంలో విజయం సాధించి బిగ్ బాస్ టైటిల్ కూడా గెలిచాడు.

ఇప్పుడు బిగ్ బాస్ 3 విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతోంది. రాహుల్ సిప్లిగంజ్ మహా అయితే నాలుగు వారాలు హౌజ్ లో ఉంటాడని ఊహించారు. అయితే తనలో నెగటివ్స్ ఉన్నా ఒప్పుకోవడం, దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయడం, మాట దురుసుతనం కూడా బాగా తగ్గించుకోవడంతో రాహుల్ అందరి ఫెవరెట్ అయ్యాడు.

మరోవైపు శ్రీముఖి పదే పదే రాహుల్ ను టార్గెట్ చేస్తుండడంతో శ్రీముఖి అంటే పడని వాళ్లంతా రాహుల్ సైడ్ తీసుకుంటున్నారు. శ్రీముఖికి నోటి దురుసుతనం అడ్డంకిగా మారగా, వరుణ్ సందేశ్ కు భార్య వల్ల కొంత నెగటివిటీ వచ్చింది. బాబా భాస్కర్ సేఫ్ గేమర్ గా పేరు వచ్చింది. దాంతో రాహుల్ అందరికంటే ముందున్నాడు. ప్రస్తుతం ఏడుగురు నామినేషన్స్ లో ఉండగా రాహుల్ కు ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. రాహుల్ కు సెకండ్ ప్లేస్ లో ఉన్న శ్రీముఖికి మధ్య 10 శాతం ఓట్ల డిఫరెన్స్ ఉండడం గమనార్హం. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అయినా ఆశ్చర్యం లేదు.