హీరోగా రాహుల్ సిప్లీగంజ్ – డైరెక్టర్ .?


Rahul sipligunj into movies as a hero
Rahul sipligunj into movies as a hero

బిగ్ బాస్ టైటిల్ గెలిచినా వాళ్ళకి అది ఆ తర్వాత నిజజీవితంలో పెద్దగా ఉపయోగపడలేదు. సీజన్ 1 గెలిచిన శివ బాలాజీ ఆ తర్వాత సినిమాలలో బిజీ అవుతాడు అనుకుంటే, జరగలేదు. ఇక సీజన్ 2 లో విన్నర్ అయిన కౌశల్ అయితే కౌశల్ ఆర్మీ అని సొంతంగా ఫ్యాన్ బేస్ పొందినా, పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు సీజన్ 3 విజేత సింగర్ రాహుల్ సిప్లీగంజ్ ఇప్పటికే వరుస ఈవెంట్స్ తో జనాలలో హైప్ తగ్గకుండా చూసుకుంటున్నాడు. బిగ్ బాస్ కి వెళ్ళక ముందే సింగర్ ఎస్టాబ్లిష్ అయిన రాహుల్ ఇప్పుడు సినిమాలలో నటిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇక అది ఎవరితోనో కాదు.; క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలో చేస్తున్నాడని విశ్వసనీయ వర్గ సమాచారం.

కృష్ణవంశీ గత సినిమాలు దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో కృష్ణవంశీ ప్రస్తుతం రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో “రంగ మార్తాండ” అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో జీవిత రాజశేఖర్ కూతురు నటిస్తోంది. ఇక ఆమెకు జంటగా ఈ సినిమాలో రాహుల్ సిప్లీగంజ్ నటిస్తున్నాడని ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి. ఇది నిజమైతే సినిమా హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా, రాహుల్ కి గోల్డెన్ చాన్స్ వచ్చినట్లు భావించవచ్చు.