త‌లైవాతో బిగ్‌బాస్ 3 విన్న‌ర్ హంగామా!

త‌లైవాతో బిగ్‌బాస్ 3 విన్న‌ర్ హంగామా!
త‌లైవాతో బిగ్‌బాస్ 3 విన్న‌ర్ హంగామా!

టైమ్ ఎవ‌రి జీవితాన్ని ఎలాంటి మ‌లుపు తిప్పుతుందో ఎవ‌రు చెప్ప‌లేరు. ఒక్క‌సారి ల‌క్కు స్టార్ట‌యిందా ఎన్ని అడ్డంకులు ఎదురైనా అత‌న్ని ఆప‌డం క‌ష్ట‌మే. దీనికి బిగ్‌బాస్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ మంచి ఉదాహ‌ర‌ణ‌. పాత‌బ‌స్తీలొ కూని రాగాలు తీసుకుంటూ గ‌ల్లీల్లో పాట‌లు పాడుకుండూ సినిమాల దాకా వ‌చ్చాడు రాహుల్ సిప్లిగంజ్‌. యువ సంగీత ద‌ర్శ‌కుడు వెంగీ స‌హ‌కారంలో కీర‌వాణికి ద‌గ్గ‌రైన ఆ త‌రువాత అంచ‌లంచెలుగా ఎదుగుతూ వ‌చ్చాడు.

అలాంటి రాహుల్ జీవితం `బిగ్‌బాస్ 3`తో ఒక్క‌సారిగా మారిపోయింది. ఎంతో పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఎంతో మందికి ద‌గ్గ‌ర‌య్యేలా చేసింది. బీఎం డ‌బ్ల్యూ కార్‌లో తిరిగేలా చేసింది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా త‌న పేరు వినిపించ‌డంతో ఆ క్రేజ్‌కి త‌గ్గ‌ట్టే రాహుల్ అడుగులు వేస్తున్నాడు. కృష్ణ‌వంశీ రూపొందిస్తున్న `రంగమార్తాండ‌`లో గోల్డెన్ ఛాన్స్ ని సొంతం చేసుకుని ఆశ్చర్య‌ప‌రిచిన రాహుల్ తాజాగా సోస‌ల్ మీడియాలో పెట్టిన ఓ ఫొటో వైర‌ల్ గా మారింది.

త‌లైవ‌ర్ ర‌జ‌నీతో అత్యంత స‌న్నిహితంగా వున్న ఓ ఫోటోని రాహుల్ షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్‌ని ఈ సంద‌ర్భంగా రాహుల్ ఎంజాయ్ చేసిన తీరు ప‌లువురిని ఆకట్టుకుంటోంది. ర‌జిని 168 చిత్రాన్ని `సిరుతై` శివ ద‌ర్శ‌క‌త్వ‌లో చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగ్ సెట్‌కి వెళ్లిన రాహుల్ త‌లైవ‌ర్ ర‌జ‌నీతో క‌లిసి ఫొటోల‌కి ఫోజులివ్వ‌డం విశేషంగా చెప్పుకుంటున్నారు.