రాహుల్ జాక్ పాట్ కొట్టేసావుగా


rahul sipligunj singing a song in sarileru neekevvaru
rahul sipligunj singing a song in sarileru neekevvaru

రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ ముందు వరకూ ఈ పేరు కొద్దిమందికి మాత్రమే తెలుసు. లై, రంగస్థలం, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాల్లో పాటలు పాడినా కానీ రాహుల్ సిప్లిగంజ్ రేంజ్ ఒక స్థాయి వరకే వెళ్ళింది. అయితే బిగ్ బాస్ సీజన్ 3 గెలిచాక మాత్రం రాహుల్ పేరు మార్మోగిపోయింది. ఎక్కడ చూసినా తన పేరే. మంచికైనా, చెడుకైనా సోషల్ మీడియాలో తన హల్చల్ బాగా నడిచింది. తన గురించి డిస్కషన్స్ కూడా జరిగాయి. రాహుల్ సిప్లిగంజ్ బేసిక్ గా సింగర్ కాబట్టి బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు కొన్ని మంచి పాటలను వదిలేసుకున్నాడు. అందులో ప్రముఖమైనది రాములో రాముల. అల వైకుంఠపురములో చిత్రంలోని ఈ సాంగ్ ను మొదట రాహుల్ చేత పాడిద్దామనుకున్నాడు తమన్. అయితే రాహుల్ బిగ్ బాస్ హౌజ్ లో ఉండిపోవడంతో, దీపావళికి సాంగ్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అవ్వడంతో అనురాగ్ కులకర్ణి చేత పాడించాడు.

రాహుల్ పాడి ఉంటే ఎలా ఉండేదో కానీ అనురాగ్ మాత్రం ఈ పాటకు పూర్తి న్యాయం చేసాడు. రాములో రాముల సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ పాట హిట్ అవ్వడానికి సింగర్, మ్యుజిషియన్, లిరిక్ రైటర్ తో పాటు మ్యూజిక్ వీడియో కూడా ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పటిదాకా లిరికల్ వీడియోస్ కు అలవాటు పడిన జనాలకు ఈ మ్యూజిక్ వీడియోస్ బాగా అట్ట్రాక్ట్ చేస్తోంది. అల వైకుంఠపురములో నుండి విడుదలైన రెండు పాటలకు కూడా భీభత్సమైన రెస్పాన్స్ వచ్చిన కారణంగా ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా ఇలా మ్యూజిక్ వీడియోస్ చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఇప్పుడు రాహుల్ కు ఫేమ్ ను క్యాష్ చేసుకునేందుకు అతని చేత పాట పాడించి మ్యూజిక్ వీడియో చేయాలని సినిమా జనాలు అనుకుంటున్నారు.

పాట ఎలాంటిదైనా స్పష్టంగా పలకడం, హై పిచ్ లో కూడా గొంతు శృతి తప్పకపోవడం రాహుల్ కు ఉన్న ప్రధాన ప్లస్ పాయింట్స్. బిగ్ బాస్ వల్ల రాములో రాముల మిస్ అయిన రాహుల్ కు మరో మంచి అవకాశం తలుపు తట్టినట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రాహుల్ చేత ఒక మంచి పాట పాడించే ప్రయత్నాల్లో ఉన్నాడట దేవి శ్రీ ప్రసాద్. ఇటీవలే సరిలేరు బృందం, ఇందులో మరో స్పెషల్ సాంగ్ ను పెట్టాలని నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే దానికి ట్యూన్ రెడీ అయిపోగా దేవి, రాహుల్ అయితే ఈ పాటకు ప్లస్ అని భావిస్తున్నాడట. మరి ఇది మ్యూజిక్ వీడియో తరహాలో షూట్ చేస్తారో లేక మాములుగా లిరికల్ వీడియో విడుదల చేస్తారో తెలీదు కానీ ప్రస్తుతానికి రాహుల్ మహేష్ బాబు సినిమాలో పాట పాడుతున్నాడు.

సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో.. ఈ రెండు చిత్రాలు కూడా సంక్రాంతికే ఒకే రోజున, జనవరి 12న విడుదల కానున్నాయి. మరి  ఈ రెండు చిత్రాల్లో ఏది ముందుకు లేక వెనక్కు వెళుతుందో ప్రస్తుతానికి సస్పెన్స్