భరత్ బహిరంగ సభ సజావుగా సాగుతుందా


Rain problem for mahesh bharath ane nenuఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్ర ఆడియో వేడుక అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి గా నటిస్తుండటం తో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావించారు. పైగా ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా పిలిచారు.

కానీ నిన్న హైదరాబాద్ లో బీభత్సమైన వర్షం కురిసింది అంతేకాదు ఈరోజు ,రేపు కూడా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భరత్ బహిరంగ సభ సజావుగా సాగుతుందా అన్న అనుమానం నెలకొంది. వరుణుడు సహకరిస్తే భరత్ బహిరంగ సభ విజయవంతం అవుతుంది లేకపోతే ఇబ్బందులు తప్పవు.