రాజ్ తరుణ్ కెరీర్ ఆ సినిమాతో తేలిపోనుంది


raj tarun hopes on lover యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ప్రారంభంలో వరుస హిట్స్ తో దూసుకుపోయాడు దాంతో ఈ కుర్ర హీరోకు బోలెడు భవిష్యత్ ఉంటుంది అని అనుకున్నారు కట్ చేస్తే వరుస పరాజయాలతో అసలు కెరీర్ మొత్తమే డైలమాలో పడింది పాపం . ఇటీవలే విడుదలైన రాజు గాడు డిజాస్టర్ అయ్యింది దాంతో నిరాశకు గురైన రాజ్ తరుణ్ కొద్దిరోజులు సైలెంట్ అయిపోయాడు , వరుస ఫ్లాప్ లు రాజ్ తరుణ్ ని సతమతం చేసాయి అయితే నిరాశ మనిషి ని మరింతగా క్రుంగ దీస్తుంది కాబట్టి ధైర్యం కూడదీసుకొని మరో సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు .

తాజాగా ఈ హీరో నటించిన లవర్ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది . అనీష్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . దిల్ రాజు బ్యానర్ అంటే మినిమం గ్యారెంటీ సినిమా కాబట్టి రాజ్ తరుణ్ ఆశలన్ని ఆ సినిమాపైనే ఉన్నాయి . లవర్ హిట్ అయితే రాజ్ తరుణ్ లో సరికొత్త జోష్ రావడం ఖాయం . లేకపోతే మరింత నిరాశ చెందడం ఖాయం . మరి లవర్ హిట్ అవుతుందా ? రాజ్ తరుణ్ లో జోష్ నింపుతుందా ? చూడాలి .