టీజ‌ర్ టాక్‌: ఈ అమ్మాయిలు ముదుర్ల‌బ్బా!టీజ‌ర్ టాక్‌: ఈ అమ్మాయిలు ముదుర్ల‌బ్బా!
టీజ‌ర్ టాక్‌: ఈ అమ్మాయిలు ముదుర్ల‌బ్బా!

రాజ్ త‌రుణ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `ఒరేయ్ బుజ్జిగా`. విజ‌య్‌కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాళ‌విక నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ్రీ‌స‌త్య‌సాయి ఆర్ట్స ప‌తాకంపై కె.కె. రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీల‌క పాత్ర‌ని హేబా ప‌టేల్ పోషిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడుద‌ల చేసిన `కురిసె కురిసే.. అంటూ  సాగే పాట‌ని ఇటీవ‌ల విడుద‌ల చేశారు. మంచి స్పంవద‌న ల‌భించింది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ని స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్ బుధ‌వారం రిలీజ్ చేశారు.

`గుండెజారి గ‌ల్లంత‌య్యిందే` వంటి హిట్ చిత్రాన్ని అందించిన విజ‌య్‌కుమార్ కొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. టీజ‌ర్‌లో మంచి కంటెంట్ క‌నిపిస్తోంది. `ఈ అమ్మాయిలు ముదుర్ల‌బ్బా..` అంటూ హీరో రాజ్ త‌రుణ్ చెబుతున్న డైలాగ్‌లు యూత్‌కు  క‌నెక్ట్ అయ్యేలా వున్నాయి. మందుందా..? అని హీరోయిన్ మాళ‌వికా నాయ‌ర్ తండ్రి న‌రేష్‌ని అడుగుతున్న తీరు సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగుతుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. చివ‌ర‌గా మాళ‌వినా నాయర్ `మీ ల‌వ్‌స్టోరీ సింప్లీ సూప‌ర్..` అన‌డం ఆక‌ట్టుకుంటోంది.

సినిమాని ద‌ర్శ‌కుడు విజ‌య్‌కుమార్ కొండా కొత్త పంథాలో తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది. కార్తి `ఖైదీ`తో ఇటీవ‌లే బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందుకున్న నిర్మాత‌ కె.కె. రాధామోహ‌న్ ఈ ప్రేమ‌క‌థా చిత్రాన్ని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించిన‌ట్టు క‌నిపిస్తోంది. నిర్మాత కె.కె. రాధామోహ‌న్ మాట్లాడుతూ `మా `ఓరేయ్ బుజ్జిగా` టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన హ‌రీష్‌శంక‌ర్‌గారికి ధ‌న్య‌వాదాలు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. టీజ‌ర్‌కు అంత‌కు ఇంచిన రెస్పాన్స్ ల‌భిస్తుంద‌ని భావిస్తున్నాం. అన్ని వ‌ర్గాల్ని ఆక‌ట్టుకునేలా ద‌ర్శ‌కుడు విజ‌య్‌కుమార్ కొండా ఈ చిత్రాన్ని రూపొందించారు.  మా ద‌ర్శ‌కుడు ఉగాది కానుక‌గా ఈ నెల 25న చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. క‌చ్చితంగా మా సంస్థ‌లో మ‌రో హిట్ సినిమా అవుతుంది` అన్నారు.