యంగ్ హీరో నానితో తలపడుతున్నాడు

యంగ్ హీరో నానితో తలపడుతున్నాడు
యంగ్ హీరో నానితో తలపడుతున్నాడు

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ చిత్రం V ఉగాది సందర్భంగా మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. ఇందులో నాని ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సాధారణంగా మన హీరోలు నటించే నెగటివ్ షేడ్స్ కాకుండా పూర్తి స్థాయి విలనీ ఈ చిత్రంలో పోషించాడని తెలుస్తోంది. సుధీర్ బాబు ఈ చిత్రంలో మరో కీలక పాత్ర చేయగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్సకత్వం వహించాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఉగాది సందర్భంగా రిలీజ్ కావడంతో వేరే సినిమాల నుండి పోటీ తప్పదని ట్రేడ్ పండితులు విశ్లేషించారు.

అయితే పోటీ ఒక స్ట్రగ్లింగ్ హీరో నుండి రావడం కొత్తగా ఉంది. గత కొంత కాలంగా హిట్ ఇవ్వడం కోసం పాట్లు పడుతున్న రాజ్ తరుణ్ ఇప్పుడు నాని సినిమాతో తలపడబోతుండడం విశేషం. కెరీర్ మొదట్లో వరస హిట్లు ఇస్తూ యంగ్ హీరోల్లో బెస్ట్ ఆప్షన్ గా ఎదిగిన రాజ్ తరుణ్, క్రమంగా మంచి కథల్ని ఎంచుకోవడంలో విఫలమై వరస ప్లాప్స్ ను ఎదుర్కొన్నాడు. ఇప్పటికే వరసగా ఆరు సినిమాల ప్లాప్స్ అందుకున్న రాజ్ తరుణ్, ఇకనైనా హిట్ కొట్టకపోతే కెరీర్ కు చాలా ప్రమాదం.

ఇతని లాస్ట్ సినిమా ఇద్దరి లోకం ఒకటే గత క్రిస్మస్ కు విడుదలైన సంగతి తెల్సిందే. ఈ సినిమా పూర్ టాక్ తో దారుణమైన కలెక్షన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా రాజ్ తరుణ్ హిట్ కొడితేనే హీరోగా లైఫ్ ఉంటుంది. దాంతో ఆశలన్నీ తన రాబోయే చిత్రం ఒరేయ్ బుజ్జిగా మీదే పెట్టుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా సైలెంట్ గా కానిచ్చేశారు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఉగాదికి విడుదలకు సిద్ధమవుతోంది. మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్. హెబ్బా పటేల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. మరి ప్లాపుల్లో ఉన్న రాజ్ తరుణ్, నానికి ఎలాంటి పోటీనిస్తాడో చూడాలి.