ప్లాప్ దర్శకుడితో మరోసారి జతకట్టనున్న యువ హీరో


raj tarun
raj tarun

యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ప్రస్తుతం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. తను హిట్ కొట్టి చాలా కాలమైంది. పైగా అనవసర వివాదాలకు ఈ మధ్య కేంద్రబిందువయ్యాడు. వీటన్నిటి నుండి బయటపడి ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల మీద తన ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం గుండె జారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మరోవైపు దిల్ రాజు నిర్మాణంలో మరో చిత్రాన్ని కూడా చేస్తున్నాడు.

ఈ రెండు చిత్రాల షూటింగ్ సమాంతరంగా జరుగుతున్నాయి. ఇవే కాకుండా ప్రస్తుతం రాజ్ తరుణ్ మరో సినిమాకి కమిట్ అయ్యాడు. యువ దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డితో రాజ్ తరుణ్ ఒక సినిమా చేయనున్నాడు. ఇదివరకు వీరిద్దరూ కలిసి సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు అనే సినిమా చేసారు.

స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్లాప్ అయినా కానీ శ్రీనివాస్ కు మరో అవకాశం ఇచ్చాడు రాజ్ తరుణ్. మరి ఈసారి ఏ నేపధ్యాన్ని ఎంచుకున్నాడో ఇంకా తెలియలేదు. ఈ ప్రాజెక్టుకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.