రాజ్ తరుణ్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది.. ఇదే ప్రూఫ్!


రాజ్ తరుణ్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది.. ఇదే ప్రూఫ్!
రాజ్ తరుణ్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది.. ఇదే ప్రూఫ్!

బ్యాక్ గ్రౌండ్ లేని యంగ్ హీరోలకు కెరీర్ నిర్మించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడూ వాళ్ళు అలెర్ట్ గా ఉండాలి. సినిమాలు కన్సిస్టెంట్ గా ఆడేలా జాగ్రత్త పడాలి. వరసగా ప్లాప్స్ రాకుండా చూసుకోవాలి. ఏదైనా తేడా జరిగిందా ఇక అంతే సంగతులు. వరస ప్లాపులను వాళ్ళు తట్టుకోలేరు. ఉదాహరణకు బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలను తీసుకుంటే సాయి ధరమ్ తేజ్.. వరసగా ఆరు ప్లాపులు పడ్డాయి. అయినా చిత్రలహరి వంటి మరో మంచి సినిమా వచ్చింది. ఇప్పుడు ప్రతిరోజూ పండగే సినిమాపై అంచనాలు కూడా బాగున్నాయి. పోనీ నితిన్ నే తీసుకుంటే ఏకంగా పదేళ్ల పాటు హిట్ అన్నదే లేదు. కానీ ఇష్క్ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టగలిగాడు. ఇప్పుడు కూడా వరస ప్లాపుల్లో ఉన్నాడు. నితిన్ నటించిన ఆఖరి మూడు చిత్రాలూ ప్లాపులే. కానీ ఇప్పుడు చేస్తోన్న భీష్మ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ బ్యాక్ గ్రౌండ్ లేని హీరోల పరిస్థితి ఇలా ఉండదు. వరసగా మూడు ప్లాపులు పడితేనే వారి కెరీర్ ఎటూ కాకుండా పోతుంది. ఇక నాలుగైదు ప్లాపులు పడ్డాయంటే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మానేస్తారు జనాలు. ఇప్పుడు యంగ్ హీరో రాజ్ తరుణ్ పరిస్థితి కొంచెం అటూ ఇటూ అలానే ఉంది.

కెరీర్ మొదట్లో మూడు సూపర్ హిట్లు కొట్టాడు రాజ్ తరుణ్. కెరీర్ ఇలాగే కొనసాగితే సెకండ్ రేంజ్ హీరోల లీగ్ లో చేరుతాడనిపించింది. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇక అది జీవితమెందుకు అవుతుంది. రాజ్ తరుణ్ కు కూడా ప్లాపులు పడ్డాయి. కొన్ని సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. దీంతో తన కెరీర్ మరీ దిగజారిపోయింది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో రాజ్ తరుణ్ పై డబ్బు పెట్టే నిర్మాతలు దొరకడం కూడా కష్టమే. కాకపోతే దిల్ రాజు కు ఉన్న మూడు సినిమాల డీల్ వల్ల తన లేటెస్ట్ సినిమా ఇద్దరి లోకం ఒకటే తెరకెక్కింది. ఈ చిత్రం క్రిస్మస్ కారణంగా డిసెంబర్ 25న విడుదల చేయాలని భావిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ సినిమాకు థియేటర్లు కూడా బానే దక్కుతాయని భావించవచ్చు. కానీ ఇద్దరి లోకం ఒకటే చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేవలం 200 స్క్రీన్లు మాత్రమే కేటాయిస్తున్నారట. ఎంత బడా నిర్మాత అయినా కానీ ఎక్కువ థియేటర్లు ఇచ్చి సినిమాను రిలీజ్ చేయించట్లేదు. ఎందుకంటే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. రాజ్ తరుణ్ కు ఇప్పుడు మార్కెట్ లో క్రేజ్ ఉండదు. ఎక్కువ థియేటర్లు ఇస్తే అవి ఖాళీగా దర్శనమిస్తే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యే అవకాశముంది. అందుకే లో రిలీజ్ కు వెళ్లాలని దిల్ రాజు డిసైడ్ అయ్యాడు. అందుకే థియేటర్ల కోసం పట్టుబట్టట్లేదు. టాక్ బాగుంటే సినిమా అదే నిలబడుతుంది అనుకుంటున్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.