తరుణ్ సినిమా ఈ సారి కూడా ఫ్లాప్ దర్శకుడితో…


తరుణ్ సినిమా ఈ సారి కూడా ఫ్లాప్ దర్శకుడితో...
తరుణ్ సినిమా ఈ సారి కూడా ఫ్లాప్ దర్శకుడితో…

తెలుగు సినిమా చరిత్రలో ఒకసారి హీరో-దర్శకుడి కలయికకి ఫ్లాప్ టాక్ పడితే రెండోసారి జనాలకి అ సినిమా మీద ఆసక్తి పోతుంది… అది నిర్మాతలకి నష్టం ఎందుకంటే అంత డబ్బులు పెట్టి సినిమాని నిలబెట్టేది ఒక నిర్మాతనే కాబట్టి. అలాంటి ఒక కలయిక ఇప్పుడు రెండవ సారి చేతులు కలపబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

2016 సంవత్సరంలో రాజ్ తరుణ్ హీరోగా – శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడిగా ఒక సినిమా వచ్చింది. సినిమా పేరు “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు”. అప్పటికే చిన్న సినిమాలు అందులోనూ రాజ్ తరుణ్ “ఉయ్యాలా జంపాలా”, “సినిమా చూపిస్త మామ”, “కుమారి 21f” వంటి హ్యట్రిక్ విజయాలు సాదించాడు అని నమ్మకంతో వెళ్లారు సినిమాకి జనాలు. ఇక ఆ సీతమ్మ అందాలు సినిమా రాజ్ తరుణ్ కెరీర్ లొ ఘోర పరాజయం అయ్యింది. మొదటి సినిమా అయిన శ్రీనివాస్ గవిరెడ్డి- రాజ్ తరుణ్ లకి చేదు అనుబావం తగిలింది. అందుకే ఈ సారి రెండవ ప్రయతంగా హిట్ కొట్టాలి అని మళ్ళీ కలువనున్నారు.

రాజ్ తరుణ్ విషయానికి వస్తే 2018 లొ వరుసగా 3 ఫ్లాపులు ‘రంగుల రాట్నం’, ‘రాజుగాడు’, ‘లవర్’ సినిమాలు. 2017 లొ మాత్రం ఆవెరేజ్ సినిమాలు మిగిలాయి. ‘ఈడోరకం- ఆడోరకం’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’. అందుకే రాజ్ తరుణ్ సినిమాల విషయంలో ఆచి-తూచి అడుగులు వేస్తూ పలు బడా నిర్మాతల మాటలు వింటూ సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు.

ఇప్పటికి మనోడు ‘దిల్ రాజు’ చేతిలో బద్రంగానే ఉన్నాడు ‘ఇద్దరి లోకం ఒక్కటే’ అని షాలిని పాండే తో కలిసి రొమాన్స్ చేయబోతున్నాడు. సినిమాకి నిర్మాత దిల్ రాజు గారే. తదుపరి సినిమా “విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో” చేయబోతున్నాడు. ఇక రాజ్ తరుణ్- శ్రీనివాస్ గవిరెడ్డి సినిమా వచ్చే సంవత్సరం పట్టాలెక్కే సూచనలు ఉన్నాయి. మిగిలిన తారాగణం మరియు నిర్మాతలా వివరాలు కూడా తొందరలోనే తెలియజేయనున్నారు సినిమా సబ్యులు.