రాజ్ కందుకూరి విడుదల చేసిన “అంతేర్వేదమ్” ఫస్ట్ లుక్


Raja Kandukuri Released Antharvedam First Look

ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన చిత్రం “అంతేర్వేదమ్” .చందిన రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఇవాళ ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవికొషోర్ మాట్లాడుతూ.. “మనిషి చనిపోయినప్పుడు, నిద్రపోయినప్పుడు, కోమాలో ఉన్నప్పుడు అతని ఆత్మ ఎటువైపు వెళ్తుంది? ఈ మూడు దశల్లో శరీరం నుంచి బయటకు వెళ్లిన ఆత్మలు ఎక్కడ కలుస్తాయి? మనం నిద్రపోయినప్పుడు మన ఆత్మ మనకి తెలియకుండా ఆ ప్రదేశానికి వెళ్ళి చనిపోయిన వారిని, మనకి తెలియనివారిని కలిసి వస్తుందా? దీనినే మనం “కల” అనుకుంటునామా?, ఇలాంటి విషయాలు అన్ని వ్రాసి ఉన్న తాళపత్ర గ్రంధం పేరే “అంతేర్వేదం”. ఆ తాళపత్ర గ్రంధం ఆధారంగా నిర్మించిన చిత్రమే “అంతేర్వేదమ్”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఇవాళ ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేసి.. వీలైనంత త్వరగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తామ్” అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. “సబ్జెక్ట్ విన్నాను, చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉంది. దర్శకుడికి మంచి విజన్ ఉంది. ప్రపంచానికి తెలియని నిజాలను, సిద్ధాంతాలను ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకొనే ప్రయత్నం గొప్పది. తప్పకుండా అందర్నీ ఆకట్టుకొంటుందని ఆశిస్తున్నాను” అన్నారు.

అమర్, సంతోషి, షాలు చౌరస్య, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ మహేష్ ,దొరబాబు, రవి, లడ్డు, యోగి తదితరులు నటించిన చిత్రానికి చందిన రవికిషోర్ రచన దర్శకత్వం వహించారు. శివ దేవరకొండ కెమెరామెన్ గా జె.యెస్.నిథిత్ సంగీతం దర్శకత్వం వహించారు.

English Title: Raja Kandukuri Released Antharvedam First Look