మలుపులు తిరుగుతున్న కారు యాక్సిడెంట్ కథ


Raj Tarun
Raj Tarun

హీరో రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కథ రోజు రోజుకి అనేక మలుపులు తిరుగుతోంది . నేను అసలు ఇంట్లో నుండి బయటకే వెళ్ళలేదు , కారు యాక్సిడెంట్ గురించి తెలీదు అంటూ మొదట చెప్పుకొచ్చిన రాజ్ తరుణ్ ఆ తర్వాత అనూహ్యంగా మూల మలుపు రావడంతో కారు యాక్సిడెంట్ జరిగిందని ఒప్పుకున్నాడు . ఆ తర్వాత కార్తీక్ అనే వ్యక్తి వచ్చి రాజ్ తరుణ్ మనిషి రాజా రవీంద్ర నన్ను బెదిరిస్తున్నాడని , 5 లక్షలు కూడా ఇస్తామని అన్నారని ఆరోపించాడు .

ఇక ఇప్పుడేమో రాజా రవీంద్ర బయటకు వచ్చి అసలు 5 లక్షలు డిమాండ్ చేస్తున్నది కార్తీక్ మాత్రమే ! మేము ఇస్తామని అనలేదు పైగా మమ్మల్నే బ్లాక్ మెయిల్ చేసున్నాడు అంటూ ఆరోపణలు చేస్తున్నాడు రాజా రవీంద్ర . రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కేసు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించేలా నడుస్తోంది . మరి ఇది ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి .