రాజా ది గ్రేట్` హీరో ముందు ర‌వితేజ కాదా?

రాజా ది గ్రేట్` హీరో ముందు ర‌వితేజ కాదా?
రాజా ది గ్రేట్` హీరో ముందు ర‌వితేజ కాదా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన చిత్రం `రాజా ది గ్రేట్‌`. క‌ళ్లులేని ఓ యువ‌కుడు త‌ను ప్రేమించిన ల‌క్కీ కోసం ఏం చేశాడు? త‌న‌ని త‌న స‌మ‌స్య‌ల నుంచి ఎలా కాపాడాడు అనే స్టోరీతో రూపొందిన చిత్ర‌మిది. ఇందులో క‌ళ్లులేని దివ్యాంగుడిగా మాస్ రాజా ర‌వితేజ న‌టించి అద‌ర‌గొట్టేశారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మించ‌గా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించి ర‌వితేజ ఖాతాలో సాలీడ్ హిట్‌ని చేర్చింది.

అయితే ఈ మూవీకి ముందు హీరోగా ర‌వితేజ‌ని అనుకోలేద‌ని మ‌రో హీరోని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్ర క‌థ‌ని రాసుకున్నాన‌ని ఫైన‌ల్‌గా జోన‌ర్ స‌మ‌స్య కార‌ణంగా స‌ద‌రు హీరో ఈ మూవీని చేయ‌లేక‌పోయాడ‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేశారు. మ‌రి ఇంత‌కీ `రాజా ది గ్రేట్` స్టోరీని అనుకున్న‌ది ఏ హీరో కోసం అన్న‌ది కూడా చెప్పేశారు అనిల్ రావిపూడి.

అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనిల్ రావిపూడి `రాజా ది గ్రేట్‌` స్టోరీని ముందు హీరో రామ్ కోసం రాసుకున్నాన‌ని, కానీ ఎందుకో ఆ త‌రువాత మా కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ కాలేద‌ని, అప్ప‌టికే రామ్ `హైప‌ర్‌`కితోడు మ‌రో యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే సినిమాలో న‌టించారు. మ‌ళ్లీ అదే జోన‌ర్ లో కాకుండా కాస్త భిన్నంగా చేయాల‌నుకున్నారు. అందుకే ఆ సినిమా ఆగిపోయింది. త్వ‌ర‌లో రామ్‌తో సినిమా వుంటుంది` అని తెలిపారు.