ఎన్టీఆర్ – మోహ‌న్‌లాల్ మ‌ళ్లీ క‌లుస్తున్నారా?


ఎన్టీఆర్ - మోహ‌న్‌లాల్ మ‌ళ్లీ క‌లుస్తున్నారా?
ఎన్టీఆర్ – మోహ‌న్‌లాల్ మ‌ళ్లీ క‌లుస్తున్నారా?

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన చిత్రం `జ‌న‌తా గ్యారేజ్‌`. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రంగా నిలిచింది. స‌మంత‌, నిత్యామీన‌న్ హీరోయిన్‌లుగా న‌టించిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ కీల‌క పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే.

సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుద‌ర‌డంతో ఆడియ‌న్స్ వీరి స‌న్నివేశాల్ని, పాత్ర‌ల్ని ఎంజాయ్ చేశారు. దాంతో కొర‌టాల అనుకున్న మ్యాజిక్ వ‌ర్క‌వుట్ అయ్యింది. తాజాగా మ‌రోసారి వీరిద్ద‌రిని క‌ల‌పాల‌ని, ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేయాల‌ని జ‌క్క‌న్న ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలిసింది. దిగ్రేట్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్ర‌మిది.

రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ ఆదివాసీ యోధుడు కొమ‌రం భీంగా న‌టిస్తున్నారు. ఇందులో కొమ‌రం భీంకు క‌ర్త‌వ్య‌బోధ చేసిన బాబాయ్ పాత్ర వుంద‌ట‌. అత‌ని కార‌ణంగానే కొమరం భీం రెబ‌ల్‌గా త‌యార‌య్యార‌ని నిజాం ఆగ‌డాల‌పై స‌మ‌ర శంఖం పూరించార‌ట‌. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన రాజ‌మౌళి ఆ పాత్ర కోసం హీరో మోహ‌న్‌లాల్‌ని సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. జ‌క్క‌న్న ఆఫ‌ర్‌ని మోహ‌న్‌లాల్ అంగీక‌రిస్తారా? లేదా అన్న‌ది తెలియాలంటే `ఆర్ఆర్ఆర్‌` టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.