అర్జున్ రెడ్డి దర్శకుడి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన జక్కన్న

అర్జున్ రెడ్డి దర్శకుడి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన జక్కన్న
అర్జున్ రెడ్డి దర్శకుడి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన జక్కన్న

ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇళ్లల్లో పని మనుషులు, హౌస్ కీపర్స్ కూడా మన ఇంటికి రాలేని పరిస్థితి. సెలబ్రిటీలు అందరూ ఈ మధ్య తమ పనులు తామే చేసుకుంటున్నట్లు వీడియో తీసి పెడుతున్నారు కూడా. తామే ఇల్లు తుడుచుకోవడం, అంట్లు తోముకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇలా వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో కొత్త ఛాలెంజ్ ను మొదలుపెట్టాడు. సోషల్ మీడియాలో ఇప్పటికే రకరకాల ఛాలెంజ్ లు పుట్టుకొచ్చాయి. అందులో కొన్ని సరదాగా చేసేవి అయితే కొన్ని మంచి కాజ్ కోసం చేస్తున్నవి, మరికొన్ని ఎటువంటి తలాతోకా లేని ఛాలెంజ్ లు పుట్టిస్తున్నారు.

అయితే దర్శకుడు సందీప్ రెడ్డి, బి ది రియల్ మ్యాన్ అని కొత్త ఛాలెంజ్ ను మొదలుపెట్టాడు. “ఇంటి పనులు చేయడంలో మగవాడు ఎప్పుడూ ముందుంటాడు. నిజమైన మగవాడు ఆడవారితో మొత్తం ఇంటి పనులను చేయనివ్వడు. ఆ పనుల్లో భాగం పంచుకుంటాడు. దయ చేసి ఇంటి పనివారు లేని ఇలాంటి సమయంలో ఆడవారికి సహాయం చేయండి” అని తను చేస్తున్న ఇంటి పనులను వీడియో తీసి పెట్టాడు. అంతే కాకుండా ఎస్ ఎస్ రాజమౌళిని ఈ వీడియోకు ట్యాగ్ చేసి రాజమౌళి గారిని ఇలానే ఒక వీడియో చేసి మరింత మందిని ఇన్స్పైర్ చేయాలని కోరుతున్నాను అని తెలిపాడు.

దానికి రాజమౌళి నుండి స్పందన వచ్చింది. నీ ఛాలెంజ్ ను ఒప్పుకుంటున్నాను సందీప్. ఇంటి పనుల్లో భాగం తీసుకోవడం మన ధర్మం. నా వీడియోను రేపు అప్లోడ్ చేస్తాను అని తెలిపాడు. మరి రాజమౌళి వీడియో ఎలా ఉంటుందో చూడాలంటే రేపటి వరకూ వేచి చూడక తప్పదు. రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.