రెండు వారాల స్వీయ నిర్భంధం పూర్త‌యింది!


Rajamouli and his family wins Coronavirus
Rajamouli and his family wins Coronavirus

జూలై 29న రాజ‌మౌళి త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌కి గ‌త కొన్ని రోజులుగా జ్వ‌రం వ‌స్తోంద‌ని, ప‌రీక్ష‌లు చేయిస్తే స్వ‌ల్పంగా పాజిటివ్ ల‌క్ష‌ణాలు వున్న‌ట్టు బ‌య‌ట‌ప‌డింద‌ని, డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు కుటుంబ స‌భ్యులం అంతా హోమ్ క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయామ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. దీంతో టాలీవుడ్ ఒక్క సారిగా షాక్‌కు గురైంది. ఇన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నా సెల‌బ్రిటీలు కోవిడ్ బారిన ప‌డుతుండ‌టంతో అంతా షాక్ కు గుర‌య్యారు.

తాజాగా క్వారెంటైన్ పిరియ‌డ్ పూర్త‌యింద‌ని రాజ‌మౌళి వెల్ల‌డించ‌డం తో అంతా ఊప‌రి పీల్చుకున్నారు.    2 వారాల స్వీయ దిగ్బంధం పూర్తయింది. ఎలాంటి లక్షణాలు లేవు. టెస్ట్ చేయిస్తే నెగెటివ్ వ‌చ్చింది. ప్లాస్మా దానం కోసం త‌గినంత యాంటీ బాడీస్‌ని డెవెల‌ప్ చేశామో లేదో చూడ‌టానికి ఇప్ప‌టి నుంచి 3 వారాల పాటు వేచి చూడాల్సిన అవ‌స‌రం వుంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఆ త‌రువాతే ప్లాస్మాని దానం చేస్తాం` అని రాజ‌మౌళి ట్వీట్ చేశారు.

క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న రాజ‌మౌళి త్వ‌ర‌లోనే `ఆర్ ఆర్ ఆర్` బ్యాలెన్స్ షూటింగ్‌ని మొద‌లుపెట్టాల‌ని భావిస్తున్నారట‌. ఇటీవ‌ల `ఆర్ ఆర్ ఆర్‌` చిత్ర నిర్మాత డివీవీ దాన‌య్య కూడా క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.  ప్ర‌స్తుతం ఆయ‌న ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.