భీమ్ మరియు రామరాజు కలిస్తే ఏమవుతుంది?


RRR
RRR

దర్శకధీరుడు “ఎస్. ఎస్. రాజమౌళి” సినిమా “ఆర్. ఆర్. ఆర్” సినిమా రోజురోజుకి జనాల మీదున్న అంచనాలని పెంచేస్తుంది. రాజమౌళి గారు కూడా సినిమా మీద జనాలు ఇష్టంవచ్చిన వార్తలు రాసుకుంటారు అని చెప్పి కథని ముందే చెప్పేశారు మీడియా ముందు. అలా రోజురోజుకి ఎదో ఒక టాపిక్ మీడియా లో వస్తూనే ఉండేది. కాని సినియా యూనిట్ మాత్రం ఏమి పట్టించుకోనట్లుగా పోతుంది.

అయెతే లేటెస్ట్ గా ఒక వార్త సంచలనం రేకేతిస్తుంది.. అది ఏంటంటే సినిమాలో సగం వరకు హీరోల గురించి పరిచయం చేసే సన్నివేశాలు ఉంటే, కొద్ది సేపు తర్వాత హీరోలు అనుకోకుండా ఒకరికి తెలవకుండా ఒకరికి కలుస్తారు అంటా… ఆ సన్నివేశంలో చిన్న పాపని రక్షించే సమయంలో జూ.ఎన్.టి.ఆర్ కి దెబ్బ తగులుతుంది. రామ్ చరణ్ పాత్ర జూ.ఎన్.టి.ఆర్ కి సహాయం చేసిన తర్వాత  ఇద్దరు వారి గురించి ఒకరికి ఒకరు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఇద్దరు దారులు ఒకటే అని చెప్పి బ్రిటిష్ వారికి ఎదురు వెల్లతారు. ఇక ఆ సన్నివేశం ఇప్పుడు బలంగా ఉండేలా షూటింగ్ జరుపుకుంటుంది అని అంటున్నారు సినిమా వర్గాలు.

సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ గా జూ.ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. సంగీతాన్ని కీరవాణి గారు అందిస్తున్నారు. రామ్ చరణ్ కి హీరోయిన్ గా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తున్నారు. జూ.ఎన్.టి.ఆర్ కి జోడిగా ఎమ్మా రాబర్ట్  నటిస్తున్నారు. కే.కే. సెంథిల్ కుమార్ సినిమాకి చాయగ్రహుడు. డి.వి.వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన డి.వి.వి దానయ్య గారు భారి వ్యయంతో సినిమాని నిర్మిస్తున్నారు. ఇతర పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రకని వారు నటిస్తున్నారు. సినిమా జూలై నెల 30 వ తారీఖున 2020 సంవత్సరం లో విడుదల కాబోతుంది.