నేను షూటింగ్ మానేస్తున్నా: రాజ‌మౌళి


నేను షూటింగ్ మానేస్తున్నా: రాజ‌మౌళి
నేను షూటింగ్ మానేస్తున్నా: రాజ‌మౌళి

`బాహుబ‌లి` చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటించారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. దీంతో తెలుగులో సినిమా ఏదైనా సినిమా రాబోతోందంటే ప్ర‌పంచం మొత్తం తెలుగు సినిమా వైపే చూస్తోంది. అలాంటి ప‌రిస్థితిని క్రియేట్ చేసి తెలుగు సినిమాకు గౌర‌వాన్ని తీసుకొచ్చిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి హ‌ఠాత్తుగా షూటింగ్ ఆపేస్తానంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రాజ‌మౌళి ఏంటి షూటింగ్‌ని ఆపేస్తానంటూ ట్వీట్ చేయ‌డం ఏంట‌ని అంతా విస్తూ పోతున్నారు.

ప్ర‌స్తుతం రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` పేరుతో భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తున్నారు, ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌రణ వైజాగ్ స‌మీపంలోని అర‌కు ప‌రిస‌రాల్లో జ‌రుగుతోంది. ఇదిలా వుంటే రాజ‌మౌళి షూటింగ్ ఆపేయ‌డం ఏంట‌న్న‌ది ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఆయితే ఆయ‌న అలా ట్వీట్ చేయ‌డానికి అస‌లు కార‌ణం `మ‌త్తు వ‌ద‌ల‌రా` చిత్రం. అ సినిమా ద్వారా రాజ‌మౌళి, కీర‌వాణి కుటుంబానికి చెందిన వార‌సులు సింహా, కాల‌భైర‌వ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సింహా హీరోగా, కాల‌భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది.

దీనిపై స్పందించిన రాజ‌మౌళి `మా అబ్బాయిలు సింహా, కాల‌భైర‌వ ఒకే సినిమాతో ప‌రిచ‌యం అవుతున్నారు. ఇది చాలా భావోద్వేగ సంద‌ర్భం. రితేష్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ డిసెంబ‌ర్ 25న నేను షూటింగ్ మానేస్తున్నా.. మానేస్తున్నా` అని ట్వీట్ చేసి చిత్ర బృందాన్ని అభినందించారు. సింహా క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న `మ‌త్తువ‌ద‌లరా` చిత్రానికి రితేష్ ద‌ర్శ‌కుడు. ఈ నెల 25న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Credit: Twitter