కాల‌కేయుల భాషకు కూడా వెబ్‌సైటా?


కాల‌కేయుల భాషకు కూడా వెబ్‌సైటా?
కాల‌కేయుల భాషకు కూడా వెబ్‌సైటా?

రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబ‌లి` ఏస్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో అందిరికి తెలిసిందే. టాలీవుడ్ సినిమాని ప్రంచ స్థాయి చిత్రాల స‌ర‌స‌న నిల‌బెట్టి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు చాటింది. క‌లెక్ష‌న్‌ల ప‌రంగా, మేకింగ్ ప‌రంగా తెలుగు సినిమా ప్ర‌పంచ స్థాయి సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోద‌ని నిరూపించింది. దీంతో తెలుగు సినిమాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి మార్కెట్‌న క్రియేట్ చేసింది. ఇన్ని రికార్డులు సాధించిన ఈ చిత్రాన్ని జ‌క్క‌న్న ఇప్ప‌టికీ విడిచిపెట్ట‌డం లేదు.

ఏదో రూపంలో ప్రేక్ష‌కుల‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తు చేస్తూనే వున్నాడు. `బాహుబ‌లి` రిలీజ్ త‌రువాత కామిక్ బొమ్మ‌ల రూపంలో, బుక్స్ రూపంలో ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్ని ప్ర‌పంచానికి చాటిన రాజ‌మౌళి తాజాగా ఇందులో ప్ర‌ముఖంగా ప్రాచుర్యం పొందిన కిలికి భాష‌ని ప్రమోట్ చేయ‌డం మొద‌లుపెట్టారు. `బాహుబ‌లి`లో కాల‌కేయుల కోసం ప్ర‌ముఖ త‌మిళ గేయ ర‌చ‌యిత  వైర‌ముత్తు త‌న‌యుడు మ‌ద‌న్ కార్కే కిలికి భాష‌ను ప్ర‌త్యేకంగా సృష్టించిన విష‌యం తెలిసిందే.

ఈ భాషని వైర‌ల్ చేయ‌డం కోసం కొత్త‌గా ఓ వెబ్ సైట్‌ని ప్రారంభించారు. ఇటీవ‌ల దీనికి సంబంధించిన ఓ వెబ్ సైట్‌ని ఆర్ ఎఫ్ సీ సెట్‌లో రాజ‌మౌళి  ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కిలికి భాష కోసం మ‌ద‌న్ ఎంత కీసెర్చ్ చేశారో వెల్ల‌డించారు. ఈ భాష‌ని అంద‌రూ సులువుగా నేర్చుకోవ‌చ్చ‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా ఓ సందేశాన్నా రాజ‌మౌళి షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.