రూమ‌ర్స్‌పై క్లారిటీ ఇచ్చిన రాజ‌మౌళి!


రూమ‌ర్స్‌పై క్లారిటీ ఇచ్చిన రాజ‌మౌళి!
రూమ‌ర్స్‌పై క్లారిటీ ఇచ్చిన రాజ‌మౌళి!

రాజ‌మౌళి.. టాలీవుడ్ టు బాలీవుడ్‌… ఏ హీరో నోట విన్నా ఇదే మాట‌. ఈ ద‌ర్శ‌కుడితో ఒక్క‌టంటే ఒక్క సినిమా అయినా స‌రే చేయ‌మాల‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. త‌మ‌తో సినిమా చేయ‌మ‌ని ఆఫ‌ర్ చేస్తున్నారు. జ‌క్క‌న్న ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. న‌మ్ముకున్న వారి కోసం ప్రాణాల్ని సైతం లెక్క‌చేయ‌కుండా పోరాటం చేసిన ఇద్ద‌రు పోరాట యోధులు అల్లూరి సీతారారాజు, కొమ‌రం భీంల పాత్ర‌ల‌కు కాల్ప‌నిక‌త‌ని జోడించి జ‌క్క‌న్న ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

డీవీవీ దాన‌య్య అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల  విడుద‌ల చేసిన టైటిల్ టీజ‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్ లుక్ కు సంబంధించిన వీడియో సినిమాపై భారీ అంచ‌నాల్ని పెంచేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌లో 80 శాతం చిత్రీక‌ర‌ణని పూర్తి చేశారు. తాజా షెడ్యూల్ త్వ‌ర‌లో ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్న త‌రుణంలో క‌రోనా కార‌ణంగా షూటింగ్ ర‌ద్ద‌యింది.

ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత రాజ‌మౌళి చేయ‌బోయే సినిమా ఏ హీరోతో వుండ‌బోతోంది? అనే చ‌ర్చ గ‌త కొన్ని రోజులుగా న‌డుస్తోంది. ప్ర‌భాస్‌తో చేస్తార‌ని కొంత మంది అంటుంటే తేదు మ‌హేష్‌తో చేస్తార‌ని మ‌రి కొంత మంది ప్ర‌చారం చేస్తున్నారు. దీనిపై తాజాగా రాజ‌మౌళి స్పందించారు. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌భాస్‌తో చేయ‌డం లేద‌ని, మ‌హేష్‌తో చేయ‌బోతున్నాన‌ని, ఇది చాలా కాలంగా అనుకుంటున్న ప్రాజెక్టేన‌ని, ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత కె.ఎల్‌. నారాయ‌ణ నిర్మిస్తార‌ని వెల్ల‌డించారు.