రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ దసరానే!


రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ దసరానే!
రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ దసరానే!

ఈరోజుల్లో చెప్పిన డేట్ కు సినిమా రిలీజ్ చేయడమనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ అది రాజమౌళి సినిమా అంటే ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. నెలలకు నెలలు సినిమా రిలీజ్ వాయిదా పడుతుంది. బాహుబలి 1 అండ్ 2 విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. అయితే ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో మాత్రం ఈ చిత్రాన్ని జులై 30 2020న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రెస్ వాళ్ళు కూడా ఓపెన్ గానే మీరు ఇంత పక్కాగా రిలీజ్ డేట్ చెబుతున్నారు నమ్మొచ్చా అంటే జక్కన్న చాలా ధీమాగా కనిపించాడు. అయితే తన ప్రమేయం లేకపోయినా ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడటం ఖాయమని సమాచారం. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు గాయపడడం, చరణ్ కు సైరా సినిమా కమిట్మెంట్ వల్ల షూటింగ్ కు దూరంగా ఉండడంతో దగ్గరదగ్గర 60 రోజుల కాల్ షీట్స్ వేస్ట్ అయినట్లు సమాచారం.

అందుకే రాజమౌళి ఇప్పుడు జులై కాదని దసరాకి రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నాడు. సంక్రాంతికి సినిమా వాయిదా పడనుంది అంటూ వార్తలు వచ్చాయి కానీ రాజమౌళి దసరా సీజన్ ను టార్గెట్ గా పెట్టుకున్నాడట. దసరాకు తెలుగు రాష్ట్రాల్లో సైరా, నార్త్ ఇండియాలో వార్ చిత్రాలు ఎలాంటి కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టించాయో చూసిన రాజమౌళి ప్యాన్ ఇండియా సినిమాకు దసరా బెస్ట్ సీజన్ గా భావించి ఆర్ఆర్ఆర్ అప్పుడే దించాలని చూస్తున్నాడు. అయ్యే పనేనా?