ఆర్ ఆర్ ఆర్.. జక్కన్న స్పెషల్ ఇంటర్వెల్ బ్లాక్


ఆర్ ఆర్ ఆర్.. జక్కన్న స్పెషల్ ఇంటర్వెల్ బ్లాక్
ఆర్ ఆర్ ఆర్.. జక్కన్న స్పెషల్ ఇంటర్వెల్ బ్లాక్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఒక ఫిక్షనల్ పాట్రియాటిక్ మూవీగా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తైనట్లుగా వార్తలు వచ్చాయి. అయితే విజ్యువల్ ఎఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో నాలుగు నెలలు విఎఫ్ఎక్స్ వర్క్స్ కే కేటాయించారు. ముందు సందేహాలు వచ్చినా జులై లోనే ఈ సినిమా విడుదల ఉంటుందని ఇటీవలే రామ్ చరణ్ ప్రకటించాడు. మొత్తం పది భాషల్లో ఈ సినిమా విడుదల ఉంటుందని అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

ఇక ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అటు రాజమౌళి, ఇటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఏదొక అప్డేట్ ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తోంది. అది నిజమో కాదో తెలియదు కానీ రోజుకొక అప్డేట్ మాత్రం వస్తోంది.

తాజాగా ఈ చిత్రానికి ఇంటర్వెల్ బ్లాక్ ఇదేనంటూ ఒక కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. దాని ప్రకారం ఇంటర్వెల్ ముందు 20 నిమిషాల సన్నివేశం ఉంటుందిట. అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి బ్రిటిష్ వారిపై సాగించే యుద్ధం ఒళ్ళు గగుర్పుడుస్తుందని చెబుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి అభిమానులకు ఫుల్ మీల్స్ పెడతారని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి సినిమాల్లో ఇంటర్వెల్ బ్లాక్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో తెలిసిందే. స్టూడెంట్ నెం 1 నుండి మొన్నటి బాహుబలి 2 వరకూ ప్రతి సినిమాలోనూ ఇంటర్వెల్ బ్లాక్ స్పెషల్ హైలైట్ గా నిలుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో వాటన్నిటినీ తలదన్నే రీతిలో ఇంటర్వెల్ బ్లాక్ ను ప్లాన్ చేసాడట జక్కన్న.