రాజ‌మౌళి స్క్రిప్ట్ ఫినిష్ చేసే ప‌నిలో వున్నారా?

రాజ‌మౌళి స్క్రిప్ట్ ఫినిష్ చేసే ప‌నిలో వున్నారా?
రాజ‌మౌళి స్క్రిప్ట్ ఫినిష్ చేసే ప‌నిలో వున్నారా?

క‌రోనా ఉదృతి ఇప్ప‌ట్లో త‌గ్గేలా కనిపించ‌డం లేదు. దీని కార‌ణంగానే రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్నారు. క‌రోనా ఉదృతి త‌గ్గితే గానీ షూటింగ్ ప్రారంభించ‌కూడ‌ద‌ని హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఫిక్స‌య్యార‌ట‌. వారి నిర్ణ‌యం కార‌ణంగా రాజ‌మౌళి కూడా సైలెంట్ అయిపోయాడు. ఇదిలా వుంటే ప్ర‌స్తుతం స‌మ‌యం చిక్క‌డంతో రాజ‌మౌళి త‌న నెక్ట్స్ సినిమా కోసం స్క్రిప్ట్‌ని సిద్ధం చేయాల‌నుకుంటున్నార‌ట‌.

`ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత రాజ‌మౌళి స్టార్ హీరో మ‌హేష్‌బాబుతో ఓ భారీ చిత్రాన్ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. నారాయ‌ణ నిర్మించనున్న ఈ సినిమాని జ‌క్క‌న్న జాన‌ర్‌లో చేయ‌బోతున్నాడు అంటూ ఇప్ప‌టికే చ‌ర్చ మొద‌లైంది. తాజాగా ఈ చిత్రం కోసం ఓ లైన్‌ని లాక్ చేసిన రాజ‌మౌళి దాన్ని పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా మ‌ల‌చ‌బోతున్నార‌ట‌. త‌న‌కు ల‌భించిన ఈ స‌మ‌యాన్ని పూర్తి స్థాయి స్క్రిప్ట్‌కు వినియోగించ‌బోతున్నార‌ట‌.

`ఆర్ ఆర్ ఆర్ ` రిలీజ్ త‌రువాత రెండు లేదా మూడు నెల‌లు మాత్రమే విరామం తీసుకుని మ‌హేష్ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నార‌ట‌. ఇందు కోసం ఇప్ప‌టి నుంచే రాజ‌మౌళి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. నిర్మాత కె.ఎల్‌. నారాయ‌ణ సినిమా నిర్మాణం ఆపేసి దాదాపు 20 ఏళ్ల‌వుతోంది. మ‌ళ్లీ మ‌హేష్, రాజ‌మౌళి సినిమాతో ఆయ‌న నిర్మాణం చేప‌ట్ట‌బోతున్నారు.