టెస్ట్ షూట్‌కు రాజ‌మౌళి రెడీ!


టెస్ట్ షూట్‌కు రాజ‌మౌళి రెడీ!
టెస్ట్ షూట్‌కు రాజ‌మౌళి రెడీ!

క‌రోనా సినీ ఇండ‌స్ట్రీని భారీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. షూటింగ్‌లు లేవు, రిలీజ్‌కి రెడీగా వున్న సినిమాల‌కు థియేట‌ర్లు లేవు. రోజు వారీ కార్మికుల‌కు ప‌ని లేదు. 14 వేల మంది కార్మికుల్ని ఆదుకోవాలంటే ఒక్క నెల రెండు నెల‌ల వ‌ర‌కు వీల‌వుతుంది. కానీ నెల‌ల త‌ర‌బ‌డి వారికి నిత్యావ‌స‌రాలు స‌మ‌కూర్చాలంటే చాలా క‌ష్ట‌మైన ప‌ని.. ఇదే విష‌యాన్ని ప్ర‌ధాన ఎజెండాగా తీసుకుని షూటింగ్‌లు, థియేట‌ర్ల రీఓపెన్‌పై ఈ బుధ‌వారం మెగాస్టార్ చిరంజీవి నివాసంలో తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌ద్‌తో ఇండ‌స్ట్రీ పెద్ద‌లంతా కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర‌కు ఓకే కానీ షూటింగ్‌ల విష‌యానికి వ‌స్తే సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం షూటింగ్ ఎలా చేస్తార‌ని మంత్ర చిత్ర వ‌ర్గాల‌ని అడిగిన‌ట్టు తెలిసింది. దీనికి టెస్ట్ షూట్ చేసి చూపిస్తామ‌ని, ఆ విష‌యంలో ఎలాంటి అపోహ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మంత్రికి వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది.

భౌతిక దూరాన్ని పాటిస్తూ `ఆర్ఆర్ఆర్‌` కోసం రాజ‌మౌళి టెస్ట్ షూట్ చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌మౌళి టెస్ట్ షూట్ రిజ‌ల్ట్ ని బ‌ట్టి రాష్ట్ర ప్ర‌భుత్వం జూన్ మొద‌టి వారం నుంచి షూటింగ్‌ల‌కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తులు ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. `ఆర్ఆర్ఆర్‌` ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం షూటింగ్ పూర్త‌యిన విష‌యం తెలిసిందే.