చిరు అడిగితె జక్కన్న భయపడ్డారట.. ఎందుకో ?


చిరు అడిగితె జక్కన్న భయపడ్డారట.. ఎందుకో ?
చిరు అడిగితె జక్కన్న భయపడ్డారట.. ఎందుకో ?

మెగాస్టర్ చిరంజీవి అడిగితే ఎవరైనా కాస్తుందంటారా? కానీ జక్కన్న మాత్రం భయపడి కాదన్నారట. మెగాస్టార్ ఏమడిగారు? జక్కన్న రాజమౌళి ఎందుకు భయపడ్డారు? ఆ భయంతో ఎందుకు కాదన్నారు అన్నది ఆసక్తి కరంగా మారింది. మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్ ని పూరి జగన్నాధ్ పరిచయం చేశారు. అయితే పూరి కంటే ముందు రామ్ చరణ. ని పరిచయం చేసే భాధ్యతల్ని దర్శకుడు రాజమౌళి కి మెగాస్టార్ చిరంజీవి అప్పగించారట. అయితే ఈ ఆఫర్ని భయం వాళ్ళ రాజమౌళి వదులుకున్నారట. ఈ విషయాన్ని జక్కన్న తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.
మెగా హీరో ఎంట్రీ సినిమా కావడం, రామ్ చరణ్ బాలా బలాలు తెలియకపోవడంతో భయం వేసిందని, అందుకే చిరంజీవి స్వయంగా అడిగినా. చేయలేనని వదులుకున్నానని చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల తరువాత ఆనాటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. జక్కన్న ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ లో రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.