ఆ ముగ్గురిలో త‌న‌కు అత్యంత ఇష్టుడు ప్ర‌భాసేనా?


ఆ ముగ్గురిలో త‌న‌కు అత్యంత ఇష్టుడు ప్ర‌భాసేనా?
ఆ ముగ్గురిలో త‌న‌కు అత్యంత ఇష్టుడు ప్ర‌భాసేనా?

క‌రోనా కార‌ణంగా యావ‌త్ దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు.  దీంతో జ‌న జీవితం స్థంభించి పోయింది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంతా ఇంటి ప‌ట్టునే వుంటున్నారు. ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`ని తెర‌కెక్కిస్తున్న రాజ‌మౌళి కూడా ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. ఈ క్వారెంటైన్ టైమ్‌ని `ఆర్ఆర్ఆర్‌` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీ అయిపోయారు.

తాజాగా ఈ లాక్‌డౌన్ వేళ రాజ‌మౌళి ఓ టీవీ ఛాన‌ల్ లైవ్‌లో కొచ్చారు. ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. `ఆర్ ఆర్ ఆర్‌` సినిమా విశేషాల‌తో పాటు మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకున్నారు. `ఆర్ ఆర్ ఆర్‌` షూటింగ్‌ని స‌వాల్‌గా తీసుకుంటున్నాన‌ని వెల్ల‌డించిన రాజ‌మౌళి త‌న‌కు న‌చ్చిన ముగ్గురు హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌భాస్‌ల గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకున్నారు.

ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ `త‌న తొలి చిత్రానికి ఇలాంటి హీరో దొరికాడేంట‌ని ఫీల‌య్యాడ‌ట‌. అయితే త‌ను ఎన్టీఆర్ గురించి త‌ప్పుగా ఆలోచించాన‌ని `స్టూడెంట్ నెం. 1` ఇంట‌ర్వెల్ బ్యాంగ్ స‌మ‌యంలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌లు, హావ‌భావాలు చూశాక ఇత‌లో ఏతో ప్ర‌త్యేక‌త వుంద‌ని తెలిసింద‌ట. ఇక రామ్‌చ‌ర‌ణ్ గురించి మాట్లాడుతూ “మ‌గ‌ధీర‌`లో కాజ‌ల్ చ‌నిపోతున్న స‌న్నివేశంలో క‌ళ్ల‌తోనే రామ్‌చ‌ర‌ణ్ భావాల‌ని వ్య‌క్తం చేసిన తీరు హృద‌యానికి హ‌త్తుకుంద‌ని చెప్పుకొచ్చాడు.

ప్ర‌భాస్ గురించి మాత్రం చాలా ప్ర‌త్యేకంగా చెప్పుకొచ్చాడు. ఈ ఇద్ద‌రిలో న‌ట‌న గురించే చెప్పిన రాజ‌మౌళి ప్ర‌భాస్ ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి వ్య‌క్తిత్వం గురించి చెప్ప‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ప్ర‌భాస్ పైకి ఒక‌లా క‌నిపిస్తాడ‌ని, లోన మాత్రం ఓ ఫిలాస‌ఫ‌ర్ అని, త‌ను, నేను చాలా వర‌కు వ్య‌క్త‌గ‌త విష‌యాల్ని పంచుకుంటామ‌ని వెల్ల‌డించడం ఆక‌ట్టుకుంటోంది.