వ‌ణికించే చ‌లిలో `ఆర్ఆర్ఆర్‌` టీమ్ హంగామా!

వ‌ణికించే చ‌లిలో `ఆర్ఆర్ఆర్‌` టీమ్ హంగామా!
వ‌ణికించే చ‌లిలో `ఆర్ఆర్ఆర్‌` టీమ్ హంగామా!

దీపావ‌ళి ఫెస్టివెల్ సంద‌ర్భంగా `ఆర్ఆర్ఆర్‌` టీమ్ కొన్ని ఫొటోల్ని రిలీజ్ చేసింది. ఈ ఫొటోల్లో హీరోలు రామ్‌చ‌ర‌ణ్ , ఎన్టీఆర్‌, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మెట్ల‌పై కూర్చుని చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపించారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా `ఆర్ఆర్ఆర్‌` టీమ్ రిలీజ్ చేసిన ఆన్ లొకేష‌న్ వీడియో హ‌ల్‌చల్ చేస్తోంది. చ‌లి నుంచి త‌ప్పించుకోవాల‌ని సెట్ లో హీటర్లతో ప్ర‌య‌త్నిస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియోని `ఆర్ఆర్ఆర్‌` టీమ్ షేర్ చేసింది. గ‌త ఎనిమిది నెల‌లుగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోవ‌డంతో రిలీజ్ మ‌రింత వెన‌క్కి వెళ్లిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న రాజ‌మౌళి త‌న టీమ్‌తో ప‌గ‌లు, రాత్రి అని తేడా లేకుండా టైట్ షెడ్యూల్‌ని ప్లాన్ చేసి యూనిట్‌ని ప‌రుగులు పెట్టిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

దీంతో అయినా అనుకున్న స‌మ‌యానికి సినిమాని రిలీజ్ చేయాల‌న్న‌ది రాజ‌మౌళి ఆలోచ‌న‌. రాత్రి వేళ‌ల్లో చేస్తున్న షూటింగ్‌లో ఎన్టీఆర్ పై ప‌లు కీల‌క ఘ‌ట్టాల్ని చిత్రీక‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ఎన్టీఆర్, రాజ‌మౌళి, కెమెరామెన్ సెంథిల్‌కుమార్ క‌నిపించారు. ఇక రేప‌టి నుంచి నీళ్ల‌ల్లో షూటింగ్ అంటూ రాజ‌మౌళి న‌వ్వుతున్న విజువ‌ల్స్ సినిమాని పూర్తి చేయ‌డానికి జ‌క్క‌న్న ఎంత సీరియ‌స్‌గా వున్నారో తెలియ‌జేస్తోంది.