రాజమౌళి ట్రయల్ షూట్ కి మంగళం పడేశారా?


రాజమౌళి ట్రయల్ షూట్ కి మంగళం పడేశారా?
రాజమౌళి ట్రయల్ షూట్ కి మంగళం పడేశారా?

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడం తో కీలక రంగాలు తిరిగి ఓపెన్ అవుతున్నాయి. చిన్న చిన్నగా ఇప్పుడే కోలుకుంటున్నాయి. సినిమా రంగం కూడా మళ్ళీ కార్యకలాపాలు మొదలుపెట్టాలని చూస్తోంది.

అయితే ఇదే సమయంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. హైదరాబాద్ లో విళయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ప్రభుత్వ నిభందనలు పాటిస్తూ సినిమా షూటింగ్ లు .. టీవీ సీరియల్ షూటింగ్ లు మొదలయ్యాయి. నిలిచిపోయిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇదే సుమయంలో స్టార్ హీరోల చిత్రాల షూటింగ్ లు కూడా మొదలు పెట్టాలని అగ్ర దర్శకులు ప్లాన్  చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన మీటింగ్లలో ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం ట్రయల్ షూట్ ని రెండు రోజులు చేస్తానని రాజమౌళి ప్రకటించినట్టు వార్తలొచ్చాయి. ఇప్పటి వరకు దానికి సంభంధించి ఎలాంటి కదలిక లేదు. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ట్రయల్ షూట్ కి మంగళం పడేశారని తెలిసింది. రాజమౌళి ట్రయల్ షూట్ ని విరమించుకోవడానికి కారణం హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతుండటమేనని చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది.