ల‌గ్జ‌రీలు త‌గ్గించుకోవాలి – రాజ‌మౌళి


ల‌గ్జ‌రీలు త‌గ్గించుకోవాలి - రాజ‌మౌళి
ల‌గ్జ‌రీలు త‌గ్గించుకోవాలి – రాజ‌మౌళి

క‌రోనా ప్ర‌భావంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో క‌రోనా ప్ర‌భావం సినిమాపై  ఎలా వుండ‌బోతోంద‌నే అంశంపై ఓ వెబినార్ జ‌రిగింది. ఇందులో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి రాజ‌మౌళితో పాటు నాగ్ అశ్విన్‌, సురేష్‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. లాక్‌డౌన్ త‌రువాత చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మార్పులుంటాయి. దానికి త‌గ్గ‌ట్టే ద‌ర్శ‌కులు క‌థ‌ల విష‌యంలో మార్పులు చూపించాల‌న్నారు.

థియేట‌ర్లు తెరిచినా ప్రేక్ష‌కులు వ‌స్తారా లేదా అనేది ఇప్పుడే చెప్ప‌లేం. ఒక వేళ వ‌చ్చినా ఈ లోపు డిజిట‌ల్ మాధ్య‌మాల‌కు అల‌వాటుప‌డి వుంటారు. ప్ర‌పంచ సినిమాని రుచి చూస్తారు. దీంతో ప్రేక్ష‌కుల అభిరుచుల్లో మార్పు క‌నిపిస్తుంది. ఓటీటీల‌కు మించి చేస్తేనే ఆద‌రిస్తారు. నాకు స‌వాళ్లంటే ఇష్టం. కరోనా త‌రువాత ఎదుర‌య్యే స‌వాళ్ల‌న్ని తీసుకుని ప్రేక్ష‌కుల్ని మ‌రింతగా మెప్పించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను.

క‌రోనా వ‌ల్ల రాబోయే మార్పుల్లో బ‌డ్జెట్ ఒక‌టి. అంతా ల‌గ్జ‌రీలు త‌గ్గించుకోవాలి. దీంతో పారితోషికాలు త‌గ్గుతాయి. త‌ద్వారా బ‌డ్జెట్ త‌గ్గుతుంది. దీన్ని అంతా దృష్టిలో పెట్టుకుంటార‌నుకుంటున్నా. క‌రోనా త‌రువాత ఎక్్కువ మందితో షూటింగ్‌లు చేయ‌డం కుద‌ర‌దు. మ‌రీ అవ‌స‌ర‌మైతే విజువ‌ల్ ఎఫెక్ట్స్ స‌హ‌యం తీసుక‌రోవ‌డ‌మే మంచిది` అని వెల్ల‌డించారు.