50 డేస్ యాక్ష‌న్ ఎపిసోడ్‌కే అంటే..!50 డేస్ యాక్ష‌న్ ఎపిసోడ్‌కే అంటే..!
50 డేస్ యాక్ష‌న్ ఎపిసోడ్‌కే అంటే..!

`బాహుబ‌లి` చిత్రంతో రాజ‌మౌళి పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మారుమ్రోగింది. ఈ మూవీ త‌రువాత ఆయ‌న నుంచి వ‌చ్చే మూవీ అంత‌కు మించి వుంటుంద‌ని స‌హ‌జంగా అంచ‌నాలు మొద‌ల‌వుతాయి. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రాజ‌మౌళి `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌. రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైన విష‌యం తెలిసిందే. దాదాపు 50 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేశారు.

అయితే ఈ యాభైరోజుల పాటు హైద‌రాబాద్‌లో జ‌రిగిన షూటింగ్‌లో క‌థ‌కు కీల‌క‌మైన యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించార‌ట‌. ఈ విష‌యాన్నిచిత్ర బృందం సోమ‌వారం తెలిపింది. త‌దుప‌రి షెడ్యూల్ కోసం టీమ్ పూనేకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. అక్క‌డ వారం రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌మౌళి సినిమా అంటే హీరో ఎంత క‌సితో వుంటాడో అంతే క‌సితో విల‌న్ పాత్ర‌లు కూడా క‌నిపిస్తుంటాయి అన్న‌ది తెలిసిందే.

అంటే హీరో పాత్ర‌లు, విల‌న్‌ల మ‌ధ్య రాజ‌మౌళి సినిమాల్లో వ‌చ్చే స‌న్నివేశాలు రొమాంచితంగా వుంటుంటాయి. ఇక ఇలాంటి సినిమా రాజ‌మౌళికి ల‌భిస్తే ఇంకేముంది ఓ రేంజ్‌లో పోరాట ఘ‌ట్టాల‌ని డిజైన్ చేయ‌డూ .. అంచ్చు అదే ఈ మూవీకి జ‌రుగుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. యాక్ష‌న్ స‌న్నివేశాల కోస‌మే 50 రోజులు వెచ్చించారంటే సినిమాలో అవి ఏరేంజ్‌లో వుండ‌బోతున్నాయో ఊహించుకోవ‌చ్చు. అజ‌య్‌దేవ‌గ‌న్‌, అలియాభ‌ట్ తో పాటు హాలీవుడ్ న‌టుడు రే స్టీవెన్ స‌న్‌, అలీస‌న్ డూడీ, ఒలివియా మోరీస్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.