ఆర్ ఆర్ ఆర్: రిలీజ్ డేట్ విషయంలో రాజమౌళి నిర్ణయం ఇదేనా?

ఆర్ ఆర్ ఆర్: రిలీజ్ డేట్ విషయంలో రాజమౌళి నిర్ణయం ఇదేనా?
ఆర్ ఆర్ ఆర్: రిలీజ్ డేట్ విషయంలో రాజమౌళి నిర్ణయం ఇదేనా?

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి భారీ స్థాయిలో నిర్మిస్తోన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ టాప్ హీరోస్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. పీరియాడిక్ కథకు ఫాంటసీను జత చేసి ఆసక్తికర కథతో జక్కన్న ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలై ఇప్పటికే రెండేళ్లు దాటిపోయింది. కరోనా రెండు వేవ్స్ ఈ చిత్ర రిలీజ్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఇప్పటికే రెండు సార్లు సినిమాను వాయిదా వేశారు.

త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ చివరి షెడ్యూల్ మొదలవుతుందని వార్తలు అందుతున్నాయి. మరో రెండు నెలల్లో సినిమా మొత్తం పూర్తి కానుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 13న చిత్రాన్ని విడుదల చేయడం అసాధ్యమని తేలుతోంది. ట్రేడ్ పండితులు చెబుతోన్న దాని ప్రకారం ఏప్రిల్ 2022లో ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

దీనిపై రాజమౌళి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే వీలుంది. ఆర్ ఆర్ ఆర్ ను బట్టి మిగతా తెలుగు చిత్రాలు తమ రిలీజ్ డేట్లను షెడ్యూల్ చేసుకోవాలి.