రామ్ తో జక్కన్న సినిమా… జరిగే పనేనా?రామ్ తో జక్కన్న సినిమా... జరిగే పనేనా?
రామ్ తో జక్కన్న సినిమా… జరిగే పనేనా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు రెడ్ సినిమాను చేస్తున్నాడు. అంతకుముందు ప్లాపులతో ఇబ్బందిపడిన రామ్ గతేడాది ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. తిరిగి తన ఫామ్ ను సైతం అందుకున్నాడు. ఇప్పుడు తమిళ సూపర్ హిట్ తడం చిత్ర రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. రెండు, మూడు రోజుల ప్యాచ్ వర్క్ పనులు మాత్రం మిగిలున్నాయి. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగింది. ఏప్రిల్ 9కి ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని భావించారు. అయితే ఇప్పుడున్న అసాధారణ పరిస్థితుల కారణంగా అది అయ్యేలా కనిపించట్లేదు. కచ్చితంగా మే లేదా జూన్ కు సినిమా వాయిదా పడనుంది.

దీని తర్వాత రామ్ మరో సినిమాకు కూడా కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు మరొక కొత్త రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అసలు కొన్ని రూమర్స్ ఎలా పుడతాయో కానీ నమ్మడానికి చాలా కష్టంగా ఉంటాయి. అలాంటి ఒక రూమరే ఇది. దాని ప్రకారం ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న రామ్ తన తర్వాతి సినిమా విషయంలో ఒక క్లారిటీకి వచ్చాడట. అదే రామ్ తో జక్కన్న సినిమా చేయబోతుండడం.

వినడానికి కొంత వింతగా ఉన్నా ఇదే నిజమని అంటున్నారు. అయితే ఇది జరగడానికి మరో ఏడాది పైన పట్టే అవకాశం ఉంది. ఆర్ ఆర్ ఆర్ విడుదల జనవరిలో ఉంటుంది. ఈ సినిమా విడుదలయ్యాక కనీసం ఆరు నెలలు పాటు రాజమౌళి సమయం తీసుకుంటాడు. అంటే ఒకవేళ ఈ సినిమా ఉంటే వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రామ్ తో జక్కన్న సినిమా ఉంటుంది. వరసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేయడంతో రాజమౌళి బ్రేక్ తీసుకుని 50 కోట్ల బడ్జెట్ లో ఒక చిన్న సినిమా తీద్దామని అనుకుంటున్నాడని తెలుస్తోంది. మరి అదే నిజమైతే రామ్ దశ తిరిగినట్లే.