సాహో గురించి పట్టించుకోని రాజమౌళి


rajamouli prabhas
rajamouli and prabhas

సాహో ట్రైలర్ విడుదలై మూడో రోజు కావస్తోంది కానీ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి మాత్రం ఆ సినిమా పై కానీ సాహో ట్రైలర్ పై కానీ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు . రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ మూడు చిత్రాల్లో నటించాడు . ఛత్రపతి , బాహుబలి , బాహుబలి 2 ఈ మూడు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి . దాంతో ప్రభాస్ కు రాజమౌళి కి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ కుదిరింది .

అయితే సాహో ట్రైలర్ పై రాజమౌళి ఇంతవరకు ట్వీట్ చేయకపోవడంతో ఎందుకు ట్వీట్ చేయలేదనే చర్చ మొదలయ్యింది . సినిమా రంగంలో ఏదైనా జరిగినా టీజర్ , ట్రైలర్ లు వస్తే తన అభిప్రాయాన్ని చెప్పే జక్కన్న సాహో ట్రైలర్ పై మాత్రం స్పందించలేదు . అలాగే ట్వీట్ చేయలేదు . ఇటీవలే జాతీయ అవార్డులు సాధించిన వాళ్లకు మాత్రం శుభాకాంక్షలు అందజేశాడు జక్కన్న . మరి……  సాహో పై ?