`ఆర్ఆర్ఆర్‌` రిలీజ్‌కి రాజ‌మౌళి టైమ్ ఫిక్స్ చేశారా?


 

Rajamoulis RRR being palnned for dusshera
Rajamoulis RRR being palnned for dusshera

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. తెలుగులో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న చిత్రాల్లో ముందు వ‌రుస‌లో వున్న చిత్ర‌మిది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమ‌రం భీంగా. రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌లై రామ్‌చ‌ర‌ణ్‌‌, ఎన్టీఆర్ ల‌కు సంబంధించిన టీజ‌ర్‌లు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ టీజ‌ర్‌లో చూపించిన విజువ‌ల్ గ్రాండీయ‌ర్‌.. స‌న్నివేశాల‌ని చూపించిన తీరు `ఆర్ ఆర్ ఆర్‌` ఊహల‌కంద‌ని విజువ‌ల్ ట్రీట్‌గా వుంటుంద‌న్న భావ‌న క‌లిగిస్తోంది. లాక్‌డౌన్ కార‌ణంగా నిర్మాణం ఆల‌స్యం అవుతూ వ‌స్తున్న ఈ మూవీని జెట్ స్పీడుతో పూర్తి చేయాల‌ని రాజ‌మౌళి వేగం పెంచారు. ఇప్ప‌టికే ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేసిన రాజ‌మౌళి ఈ మూవీని ఎట్టిప‌రీస్థితుల్లోనూ ద‌స‌రావు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

గ‌త కొన్ని నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా అలియాభ‌ట్‌కి సంబంధించిన షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. ఇంత‌కీ ఇందులో అలియాభ‌ట్ న‌టిస్తుందా?  లేక రాజ‌మౌళికి హ్యండిస్తుందా అని వార్త‌లు వినిపించాయి. తాజాగా ఆ వార్త‌ల‌కు చెక్ పెడుతూ అలియా భ‌ట్ `ఆర్ ఆర్ ఆర్‌` సెట్‌లోకి అడుగుపెట్టింది. కొన్ని కీల‌క స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట‌ని కూడా షూట్ చేస్తున్నార‌ట‌. ఏప్రిల్ వ‌ర‌కు టోట‌ల్ షూటింగ్‌ని పూర్తి చేసి చిత్రాన్ని ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.