`ఆర్ఆర్ఆర్` షూటింగ్ ఎక్క‌డ మొద‌లౌతోంది?


`ఆర్ఆర్ఆర్` షూటింగ్ ఎక్క‌డ మొద‌లౌతోంది?
`ఆర్ఆర్ఆర్` షూటింగ్ ఎక్క‌డ మొద‌లౌతోంది?

లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయిన సినిమాల‌న్నీ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన జీవో గురువారం రాబోతోంది. ఈ నేప‌థ్యంలో త‌న చిత్రాన్నే ముందు ప్రారంభిస్తాన‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇటీవ‌ల వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. `బాహుబ‌లి` వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత రాజ‌మౌళి చేస్తున్న సినిమా కావ‌డం, ఇందులో తొలిసారి స్టార్ హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ న‌టిస్తుండ‌టంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

అందుకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఈ చిత్ర నేప‌థ్యాన్ని ముందే వెల్ల‌డించిన రాజ‌మౌళి ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ఈ వారంలోనే ప్రారంభించ‌బోతున్నారు. కీల‌క స‌న్నివేశాల్ని గండిపేట‌లో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో షూట్ చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది. సెట్ వ్యాల్యూ 18 కోట్ల‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. మేజ‌ర్ షూట్ అంతా ఇక్క‌డే పూర్తి చేయాల‌ని జ‌క్క‌న్న ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది.

ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ని పెంచేసింది. ఎన్టీఆర్ పుట్టిన రోజున కొమ‌రం భీం లుక్‌కు సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తార‌ని అంతా భావించారు కానీ లాక్‌డౌన్ కార‌ణంగా ఎన్టీఆర్ లుక్‌కు సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌ని విష‌యం తెలిసిందే.