రజనీ మ్యాజిక్ – దర్బార్ Motion Poster


రజనీ మ్యాజిక్ - దర్బార్ Motion Poster
రజనీ మ్యాజిక్ – దర్బార్ Motion Poster

పేట సినిమాతో తన అభిమానులను 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి అన్ని రకాలుగా మళ్లీ పాత రజనీకాంత్ ని గుర్తు చేసిన సూపర్ స్టార్ ఈసారి దర్బార్ అంటూ దడ పుట్టిస్తున్నాడు. కేవలం తమిళంలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ రజనీకాంత్ తో దర్బార్ సినిమా చేస్తున్నాడు. రజనీ 2.0 సినిమా నిర్మాత అయిన లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఆదిత్య అరుణాచలం అనే పేరు ఉన్న నేమ్ కార్డు తో పోలీస్ గా రజినీకాంత్ గట్టిగా చెప్పాలంటే మంట పుట్టించాడు.

రజనీ కాస్ట్యూమ్స్, రజనీ లుక్, రజనీ గ్రేస్ రజనీ స్టైల్ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా కూడా రజనీకాంత్ అభిమానులకు ఫుల్ మీల్స్ లాగా ఉండబోతోందని అర్థమైంది. రజినీకాంత్ పేట సినిమా మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ వీడియోలో తలైవా అనే సాంగ్ కూడా విడుదల చేశారు. స్క్రీన్ మీద రజినీకాంత్ కి తగ్గట్టుగా ఈ మాస్ బీట్ ఆడియన్స్ ను డాన్స్ చేయిస్తుంది. పీటర్ హెయిన్స్ తో పాటు మన తెలుగు వాళ్లైన రాం – లక్ష్మణ్ మాస్టర్లు దర్బార్ లో యాక్షన్ పార్ట్స్ డిజైన్ చేస్తున్నారు 1991లో రజనీ కాంత్ & మమ్ముట్టి కాంబో లో వచ్చిన సెన్సేషనల్ మూవీ దళపతి అనే సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన టాలెంటెడ్ అండ్ సీనియర్ సంతోష్ శివన్ మళ్ళీ 26 ఏళ్ళ తరువాత రజనీ కాంత్ దర్బార్ సినిమా కి D.O.P. గా చేస్తున్నారు. దర్బార్ సినిమాలో రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా confirm అయ్యింది. ఈ సినిమాని 2020 సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రయత్నం చేస్తున్నారు లేదంటే 2020 వేసవికి ఈ సినిమా విడుదల కానున్నది. ఏది ఏమైనా, రజినీకాంత్ లేటు వయసులో ఘాటు పెంచాడు అని చెప్పవచ్చు.